బాలీవుడ్ సెలబ్రిటీలు పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో నెటిజన్ల చేత ట్రోల్ చేయబడుతారన్నవిషయం తెలిసిందే. అయితే కొన్నిసార్లు హీరో, హీరోయిన్లు సున్నితమైన సామాజిక అంశాలపై అతిచేయటం, అనుచిత, వివాదాస్పత వ్యాఖ్యలు చేయటం వల్ల ట్రోల్‌కు గురవుతారు. కానీ తాజాగా బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతెలా విచిత్రంగా సోషల్ మీడియాలో ట్రోల్‌ను ఎదుర్కొంటున్నారు. శనివారం అలనాటి బాలీవుడ్ నటి షబానా అజ్మీ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఆమె ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాగా ఆస్పత్రిలో ఉన్న షబానా అజ్మీని పలువురు బాలీవుడ్ ప్రముఖులు పరామర్శించారు. షబానా రోడ్డు ప్రమాదం తనను బాధకు గురిచేసిందని, ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఊర్వశీ రౌతెలా కూడా షబానా త్వరగా కోలుకోవాలని తన ట్వీటర్ ఖాతాలో పేర్కొన్నారు. అయితే ప్రధాని నరేంద్రమోదీ చేసిన ట్వీట్‌లో ఒక్క అక్షరం పొల్లుపోకుండా ఊర్వశీ ట్వీట్ ఉండటంతో.. ఆమెపై నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఊర్వశీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా కామెంట్లు చేస్తున్నారు. ‘మీరు ప్రధాని మోదీ ట్వీట్‌ను ఎందుకు కాపీ చేశారు’అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. అదేవిధంగా ‘చాలా చక్కగా మోదీ ట్వీట్‌ను కాపీ చేశారు’ అని మరో నెటిజన్ ఎద్దేవా చేశారు. ‘కట్ కాపీ పేస్ట్’ చేశారంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.
చదవండి: ఆ హీరోయిన్‌ని వాట్సాప్‌లో బ్లాక్ చేసిన పంత్
Comments
Please login to add a commentAdd a comment