రిలీజ్‌కు ముందే అదరగొడుతోంది ‘ఏబీసీడీ-2’...
రిలీజ్‌కు ముందే అదరగొడుతోంది ‘ఏబీసీడీ-2’. కుర్ర జంట వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్ లు నటించిన ఈ డ్యాన్స్ సీక్వెల్ ట్రైలర్ యూట్యూబ్‌లో మెగా ‘హిట్’ అయింది. ఇద్దరు తారలూ ఎంతో ఇదిగా ఒదిగిపోయిన ఈ ట్రైలర్‌ను ఇప్పటి వరకు 2.7 మిలియన్లకు పైగా వీక్షించారు. ఇది చూసి ఉబ్బితబ్బిబ్బయిపోయిన వరుణ్ ట్విటర్‌లో తన ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు. రెండేళ్ల కిందట రిలీజైన ‘ఏబీసీడీ’కి సీక్వెల్ అయిన ఈ చిత్రానికి దర్శకుడు రెమో డిసౌజా. వరుణ్, శ్రద్ధాతో పాటు కొరియోగ్రాఫర్, డెరైక్టర్ ప్రభుదేవా కూడా కీ రోల్‌లో నటిస్తున్నాడు. జూన్ 19న సినిమా థియేటర్స్‌లోకి వస్తుంది.