
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమలు జరుపుకుంటోంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.
ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ ఆ అంచనాలు మరింత పెంచే స్థాయిలో ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. కామ్రేడ్స్ సిద్ధంగా ఉన్నారా అంటూ ఈ నెల 11త తారీఖు గురువారం ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. తెలుగుతో పాటు అన్ని దక్షిణాది భాషల్లో రిలీజ్ అవుతున్న డియర్ కామ్రేడ్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను జూలై నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.