
మా అమ్మ నాపై కోపంగా ఉంది. నెలన్నరపాటు ఇంటికి రాలేదు. కాకినాడలో షూటింగ్ చేస్తూ బిజీగా ఉన్నాను.
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘డియర్ కామ్రేడ్’ అంటూ కాకినాడలో నెలన్నర పాటు షూటింగ్ చేసేశాడు. ఇదే షెడ్యూల్‌లో రైలు ఎక్కుతూ విజయ్ గాయపడిన సంగతి తెలిసిందే. అయితే క్రిస్మస్, న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి ఈ మధ్యే ఆన్‌లైన్లోకి వచ్చేశాడు. దేవరసాంటా అంటూ తన అభిమానులకు గిఫ్ట్స్ కూడా ఇవ్వనున్నాడు.
విజయ్ ఓ వీడియోను షేర్ చేస్తూ.. ‘మా అమ్మ నాపై కోపంగా ఉంది. నెలన్నరపాటు ఇంటికి రాలేదు. కాకినాడలో షూటింగ్ చేస్తూ బిజీగా ఉన్నాను. ఇక్కడకు వచ్చిన తర్వాత డబ్బింగ్, ఇంటర్వ్యూ, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌తో కొంత బిజీగా ఉన్నాను. అందుకే అమ్మానాన్నలను కలవకలేకపోయాను. మనం మన అమ్మానాన్నలకు ఐ లవ్యూ అని గట్టిగా చెప్పం. ఎందుకో మనం ఎక్కువగా చెప్పం. మన లైఫ్‌లో ఎక్కువగా ఉండేది వాళ్లే. అయితే ఈ కొత్త సంవత్సరం నుంచి మనం మన అమ్మానాన్నలకు ఐ లవ్యూ చెబుదాం. ఇప్పుడు మా అమ్మకు ఐ లవ్యూ చెప్పి హగ్ ఇచ్చి కూల్ చేస్తా.. ఆ వీడియోను షూట్ చేస్తా.. మీరు కూడా మీ అమ్మనాన్నలకు ఐ లవ్యూ చెప్పి హగ్ ఇచ్చిన వీడియోలను #deverasanta అనే హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్‌చేయండి. మీకు ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా’ అంటూ ఓ వీడియోను షేర్ చేశాడు.