ఇంకా పిల్లల్లానే ట్రీట్‌ చేస్తున్నారు : విజయ్‌ | Vijay Devarakonda Reply To Koratala Siva over Be The Real Man Challenge | Sakshi
Sakshi News home page

ఇంకా పిల్లల్లానే ట్రీట్‌ చేస్తున్నారు : విజయ్‌

Published Fri, Apr 24 2020 10:08 AM | Last Updated on Fri, Apr 24 2020 10:39 AM

Vijay Devarakonda Reply To Koratala Siva over Be The Real Man Challenge - Sakshi

ఇంటి పనుల్లో మహిళలకు సహాయం చేయాలనే కాన్సెఫ్ట్‌తో ప్రారంభమైన ‘బి ది రియల్‌ మ్యాన్‌’ చాలెంజ్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో దుమ్ము లేపుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ చాలెంజ్‌ను విజయవంతగా పూర్తిచేశారు. హీరో ఎన్టీఆర్‌ను చాలెంజ్‌ స్వీకరించిన దర్శకుడు కొరటాల శివ.. టాస్క్‌ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చాలెంజ్‌కు ఆయన సన్సేషన్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండను నామినేట్‌ చేశారు. దీనికి విజయ్‌ తనదైన శైలిలో జవాబిచ్చారు. తనను ఇంట్లో ఇంకా రియల్‌ మేన్‌ లా చూడటం లేదని.. పిల్లల్లానే ట్రీట్‌ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ మేరకు విజయ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. 

‘శివ సార్‌, మా అమ్మ నన్ను పని చేయనియట్లే. ఎందుకంటే పని రెండింతలు అవుతుందంటా. ఇంట్లో ఇంకా రియల్‌ మేన్‌లా చూడట్లే మమ్మల్ని.. పిల్లల్లానే ట్రీట్‌ చేస్తున్నారు. కానీ  కానీ లాక్‌డౌన్‌లో నేను చేసే పనిని అందరికి చూపిస్తాను’ అని విజయ్‌ పేర్కొన్నారు. ఇక, సినిమాల విషయానికి వస్తే.. విజయ్‌ ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్‌కు జంటగా అనన్యా పాండే నటిస్తున్నారు. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని..ఛార్మి, పూరి, కరణ్‌ జొహర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

చదవండి : పోలీసులకు జ్యూస్‌ అందించిన విజయ్‌ దేవరకొండ

ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు : సంపూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement