టాలీవుడ్‌లోనే కాకుండా అటు బాలీవుడ్‌లోనూ స్టైల్ ఐకాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఇక రౌడీ(విజయ్) గురించి కానీ, అతని సినిమాల గురించి కానీ సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో చాలాసార్లు ఈ రౌడీ ట్రోలింగ్‌కు గురయ్యాడు. సాధారణంగా సినిమా వాళ్లు ట్రోల్స్‌ను సహించరు. కానీ విజయ్.. అలా కాకుండా ట్రోలింగ్‌లో ఉండే మజానే వేరంటున్నాడు. మనల్ని ట్రోల్ చేస్తున్నారంటే మనగురించి ఆలోచిస్తున్నట్లే కదా అని లాజిక్ మాట్లాడుతున్నాడు. కాగా ఆయన నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నేడు రిలీజైంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న విజయ్ సోషల్ మీడియాలో తనపై జరిగే ట్రోలింగ్‌పై స్పందించారు. ‘ఐ లవ్ ట్రోలింగ్స్..’ అంటూ మీమ్స్ క్రియేటర్లకు షాకిచ్చారు.
‘ట్రోలింగ్‌ను నేను ఇష్టపడుతాను. ట్రోల్ చేయడానికి నన్ను ఎంచుకుని, నాకోసమే ఆరా తీస్తున్నారు. అది నేను అనుసరిస్తున్న ఫ్యాషన్ కానీ, సినిమాలు కానీ ఏదైనా కానివ్వండి. కానీ నా కోసమే ప్రత్యేకంగా సమయం వెచ్చించి అందరినీ ఆకట్టుకునేలా మీమ్స్, వాటికి అనుగుణంగా క్యాప్షన్స్ తయారు చేస్తున్నారు. ఆ విధంగా నన్ను ట్రోల్ చేసేవారు నిద్రలేని రాత్రలు గడుపుతున్నారు.. అంటే వారి కలలో కూడా నేనే ఉంటున్నాను. కాబట్టి మీరూ ట్రోలింగ్‌ను ఎంజాయ్ చేయండి’ అంటూ రౌడీ సలహా ఇచ్చాడు. కాగా ఈ హీరో చివరి ప్రేమకథా చిత్రంగా పేర్కొన్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తొలిరోజే నెగెటివ్ టాక్‌ను తెచ్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment