
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి జంటగా నటిస్తోన్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ‘ఫైట్ ఫర్ వాట్ యు లవ్’ అనేది ఉప శీర్షిక. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం(మోహన్), యశ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 26న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. 3 నిమిషాల ట్రైలర్‌లో సినిమా కథ అంతా చెప్పేశారు. యాక్షన్ ఎమోషన్‌తో పాటు విజయ్ మార్క్ లిప్‌లాక్స్‌తో కూడా ట్రైలర్‌ను కట్ చేశారు.
ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్‌కు మంచి రెస్సాన్స్‌రావటంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను ఒకే రోజున విడుదల చేస్తున్నారు. శృతి రామచంద్రన్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈసినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment