
శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ హీరో హీరోయిన్లుగా లక్ష్మణ్ సినీ విజన్స్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా ‘వినరా సోదర వీరకుమారా!’. సతీష్ చంద్ర నాదెళ్ళ దర్శకత్వంలో లక్ష్మణ్ క్యాదరి నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా పూరి మాట్లాడుతూ.. ‘వినరా సోదర వీరకుమారా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా బాగుంది. దర్శకుడు సతీష్‌కి మొదటి సినిమా ఇది. కథ మొత్తం నాకు చెప్పాడు. చాలా మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇది. ఇప్పుడు యూత్‌కి కావాల్సిన సినిమా. సతీష్ ఈ చిత్రాన్ని ట్రీట్ చేసిన విధానం నాకు ఎంతగానో నచ్చింది. చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్’ అన్నారు.
నిర్మాత లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘మా చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేసిన పూరీగారికి మా యూనిట్ తరుపున కృతజ్ఞతలు. యూత్ ఫుల్ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రమిది. మా దర్శకుడు సతీష్ చంద్ర అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఫస్ట్ కాపీ రెడీ అయింది. శ్రవణ్ భరద్వాజ్ మంచి పాటలు ఇచ్చారు. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిత్రాన్ని నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము.’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment