
రచయిత వినయ్ ఇక లేరు!
శోభన్‌బాబు ‘ఏవండీ ఆవిడ వచ్చింది’, కృష్ణ ‘అమ్మ దొంగ’తో సహా పలు చిత్రాలకు కథ, మాటలు అందించిన రచయిత వినయ్‌కుమార్ ఇక లేరు. గురువారం ఉదయం హైదరాబాద్‌లోని స్వగృహంలో గుండెపోటుతో మరణించారు. ఆయన స్వస్థలం వరంగల్.
సినిమాలపై ఆసక్తితో రచయితగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ‘అమ్మనా కోడలా’, ‘ప్రేమ ఖైదీ’ వంటి పలు హిట్ చిత్రాలకు పని చేశారాయన.