ఈసారి నో సెలబ్రేషన్స్‌: హీరో యశ్‌ | Yash Cancels Wife Radhika Pandit Birthday Celebrations Over Covid 19 Widespread | Sakshi
Sakshi News home page

వ్యక్తిగత శుభ్రత పాటించండి: హీరో యశ్‌

Mar 7 2020 2:52 PM | Updated on Mar 7 2020 3:00 PM

Yash Cancels Wife Radhika Pandit Birthday Celebrations Over Covid 19 Widespread - Sakshi

ఈ ఏడాది తన భార్య రాధికా పండిట్‌ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం లేదని కన్నడ రాక్‌స్టార్‌, కేజీఎఫ్‌ హీరో యశ్‌ తెలిపారు. ప్రాణాంతక కోవిడ్‌-19(కరోనా వైరస్‌) వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అదే విధంగా ప్రతీ ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని.. అప్పుడే ప్రమాదకరమైన వైరస్‌ బారిన పడకుండా ఉంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం కేజీఎఫ్‌: చాప్టర్ 2 సినిమాతో బిజీగా ఉన్న యశ్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. షేక్‌హ్యాండ్‌ బదులు నమస్తే చెప్పాలని.. జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి సూచనలు, సలహాలు పాటించాలని పిలుపునిచ్చారు. అంతేగాకుండా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టేంతవరకు బహిరంగ ప్రదేశాల్లో సంచరించడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రాధిక బర్త్‌డే సెలబ్రేషన్స్‌ రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

కాగా యశ్‌ భార్య, కన్నడ హీరోయిన్‌ నేడు 35వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులు, అభిమానులు రాధికకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రాధిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్‌ చేశారు. ఇక పలు సినిమాల్లో కలిసి నటించిన యశ్‌- రాధిక 2016లో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరికి కూతురు ఐరా, కొడుకు సంతానం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement