గెలుపు కోసం సోదరుడి హత్య | 1 dead, 5 hurt as BSP, SP supporters clash; 2 bodies found | Sakshi
Sakshi News home page

గెలుపు కోసం సోదరుడి హత్య

Published Thu, Feb 9 2017 2:06 AM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM

గెలుపు కోసం సోదరుడి హత్య

గెలుపు కోసం సోదరుడి హత్య

లక్నో: బీఎస్పీ, ఎస్పీల మధ్య జరిగిన ఘర్షణలతో యూపీలోని తొలిదశ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హింసాత్మకంగా మారింది. బులంద్‌షహర్‌ జిల్లాలో ఆర్‌ఎల్డీ అభ్యర్థి మనోజ్‌ కుమార్‌ గౌతమ్‌ సానుభూతి ఓట్ల కోసం సోదరుడు వినోద్‌  కిడ్నాప్‌ అయినట్లు డ్రామా నడిపించి చివరకు కిరాయి హంతుకులతో హత్య చేయించాడు.

బుల్లెట్‌గాయాలతో పడివున్న వినోద్‌ మృతదేహాన్ని బుధవారం ఖుర్జా సమీపంలోని ఓ మామిడి తోటలో పోలీసులు కనుగొన్నారు. పోలీసుల విచారణలో వినోద్‌ కుమార్‌ గౌతమ్‌ హత్యకు కుట్ర పన్నింది సోదరుడు మనోజ్‌ కుమార్‌ గౌతమ్‌ననే వెల్లడైంది. దీంతో కాల్పులకు పాల్పడిన ఫిరోజ్‌తో పాటు మనోజ్‌ కుమార్‌ గౌతమ్‌ను  పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement