
ఆధార్ ఉంటేనే రాయితీ టికెట్: రైల్వే
సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రైల్వే టికెట్ ధర రారుుతీకి ఏప్రిల్ 1, 2017 నుంచి ఆధార్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది
న్యూఢిల్లీ: సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రైల్వే టికెట్ ధర రాయితీకి ఏప్రిల్ 1, 2017 నుంచి ఆధార్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. వయోవృద్ధులమంటూ రైల్వే టికెటింగ్‌లో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐఆర్‌సీటీసీ చైర్మన్, ఎండీ ఏకే మనోచా తెలిపారు. ఆధార్ లింకును రెండు విడతల్లో అమలు చేయనున్నారు.
మొదటి విడతలో 2017 జనవరి 1 నుంచి మార్చి 31 వరకు స్వచ్ఛందంగా వయోవృద్ధులు తమ వివరాలను ఇవ్వాలని.. రెండో విడతలో ఏప్రిల్ 1 తర్వాత ఆధార్‌ను తప్పనిసరి చేయనున్నట్లు చెప్పారు. కౌంటర్లతోపాటు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్లోనూ ఆధార్‌తో రాయితీ టికెట్లు పొందవచ్చని సూచించారు.