
పెళ్లి చేసుకునేందుకు మాఫియా డాన్ పిటిషన్
ముంబయి: అతి దారుణమైన ముంబయి పేలుళ్ల కేసు (1993, మార్చి 12)లో ప్రధాన నిందితుడిగా ఉన్న పెళ్లి చేసుకునేందుకు అండర్ వరల్డ్ డాన్,గ్యాంగ్‌స్టర్ అబు సలేం పెళ్లి చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. 257 మంది చనిపోవడానికి, 713మంది గాయాలపాలవడానికి కారణమైన సలేం ముంబ్రా మహిళను పెళ్లి చేసుకునేందుకు రిజిష్ట్రార్ కార్యాలయానికి వెళ్లేందుకు అనుమతి కోరాడు.
1993నాటి ముంబయి పేలుళ్లకు కీలక సూత్రదారి అయిన అబూ సలేంను 2005లో పోర్చుగల్ నుంచి భారత్‌కు అరెస్టు చేసి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దాదాపు అరడజను కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడిని కోర్టు దోషిగా కూడా తేల్చింది. అయితే, సలేం 2015లో తొలిసారి పెళ్లి అనుమతి కోసం పిటిషన్ పెట్టుకున్నాడు. అయితే, అప్పట్లో అతడి పిటిషన్ పెండింగ్‌లో పడింది. తాజాగా సోమవారం అతడు మరోసారి వివాహం చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతడి వివాహం చేసుకునేందుకు తాత్కాలిక బెయిల్‌కు అనుమతినిస్తూ ముంబయి, ఢిల్లీ కోర్టులు ఇచ్చిన ఆదేశాలను తాజా పిటిషన్‌లో పేర్కొన్నాడు. గతంలో ఈ పిటిషన్ టాడా కోర్టులో పెండింగ్‌లో ఉంది.