గ్రామస్తులతో ముఖాముఖి సమావేశంలో సీఎం యోగి
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కి తన పర్యటనలో ఊహించని పరిణామం ఎదురైంది. గ్రామ స్వరాజ్ యోజన పథకాన్ని రాష్ట్రంలో 50,000 పంచాయతీల్లో విస్తరించాలనేది యోగి ప్రభుత్వం లక్ష్యం. ఈ పథకం అమలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించడానికి యోగి గతకొన్ని రోజులుగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా ఆదిత్యానాథ్ సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో కందీపూర్, మధుపూర్ గ్రామాల్లో పర్యటించారు.
గ్రామంలో స్థానిక అధికారులు ఏర్పాటుచేసిన ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం యోగి మాట్లాడుతూ... తమ ప్రభుత్వం అధికారంలోని వచ్చాక అందరికీ మరుగుదొడ్లు నిర్మించిందా? లేదా? అని ప్రశ్నించగా... అక్కడున్న మహిళలంతా లేదు అని బిగ్గరగా అరవడంతో సీఎం షాక్‌తిన్నారు. ఈ ఘటనతో తీవ్ర అసహనానికి గురైన యోగి వెంటనే అక్కడున్న అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు లేని కుటుంబాలకు 24 గంటల్లో వారి ఖాతాలో నగదు జమచేసి, మరుగుదొడ్లు ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశం అనంతరం దళితవాడలో పర్యటించి, వారితో కలిసి భోజనం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment