ఆగ్రా మత మార్పిళ్లపై రగడ | Agra fights on religious conversion | Sakshi
Sakshi News home page

ఆగ్రా మత మార్పిళ్లపై రగడ

Published Thu, Dec 11 2014 6:36 AM | Last Updated on Sat, Sep 2 2017 5:57 PM

ఆగ్రా మత మార్పిళ్లపై రగడ

ఆగ్రా మత మార్పిళ్లపై రగడ

ప్రధాని ప్రకటన చేయాలని పార్లమెంట్‌లో  విపక్షాల పట్టు
 
న్యూఢిల్లీ: ఆగ్రా శివారులోని ఓ మురికివాడలో దాదాపు 60 ముస్లిం కుటుంబాలను బలవంతంగా హిందూ మతంలోకి మార్చినట్లు వచ్చిన ఆరోపణలు బుధవారం పార్లమెంట్‌ను కుదిపేశాయి. రాజ్యసభలో విపక్షాలు ఈ అంశాన్ని ప్రస్తావించాయి. సభ ప్రారంభంకాగానే జీరో అవర్‌లో బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ.. దీన్ని దేశ లౌకికతపై దాడిగా అభివర్ణించారు.  ‘ఆర్‌ఎస్‌ఎస్ సోదర సంస్థ బజరంగ్‌దళ్ కొందరు ముస్లింలను బలవంతంగా మతం మార్పించినట్లు పత్రికల ద్వారా తెలుస్తోంది. వారి పేదరికాన్ని అలుసుగా తీసుకుని ఈ పని చేశారు.  దీన్ని తీవ్రంగా పరిగణించాలి. కఠిన చర్య తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. ఆమెను సమర్థిస్తూ ఇతర పక్షాలు కూడా ఈ అంశంపై ప్రభుత్వ వివరణకు పట్టుబట్టాయి. దీనికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందిస్తూ.. లౌకిక విధానాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.  రాజకీయ కారణాలతో ఏదో ఒక సంస్థ పేరు చెప్పడం సరికాదన్నారు. అయితే దీనిపై ప్రధా  ప్రకటన చేయాలని కాంగ్రెస్, సీపీఎం డిమాండ్ చేశాయి. లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ ఈ అంశాన్ని లేవనెత్తింది.  ఆగ్రాలో ఏం జరిగిందో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ అంశంపై చర్చ కోసం ఆ పార్టీ  ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. మతమార్పిడిపై విమర్శలను బీజేపీ తోసిపుచ్చింది.  

కేసు నమోదు.. ఆగ్రాలో గత సోమవారం ధర్మ జాగరణ్ మంచ్ అనే హిందూసంస్థ 60 ముస్లిం కుటుంబాలకు చెందిన వంద మందిని యాగాగాలు చేసి హిందూ మతంలోకి మార్చింది.  దీనిపై బుధవారం పార్లమెంటులో ప్రతిపక్షాలు మండిపడిన నేపథ్యంలో... సదరు ఘటనపై ఆగ్రా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మతమార్పిడి చరేసిన జాగరణ్ మంచ్, దాని  కన్వీనర్ కిశోర్‌పై ఎఫ్‌ఐఆర్ కేసు పెట్టారు. దేవ్‌నార్‌లోని మురికివాడలో ఉండే వంద మందికిపైగా ముస్లింలను తిరిగి హిందువులుగా మార్చినట్లు సదరు సంస్థపై ఆరోపణలు వచ్చాయి. రేషన్‌కార్డులు, ఇంటిస్థలం ఇప్పిస్తామని హామీలు ఇచ్చి మత మార్పిడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement