Religious conversion
-
మతం మారితే రిజర్వేషన్లు వద్దు: వీహెచ్‌పీ
ధన్తోలి: మతం మార్చుకున్న ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్ ప్రయోజనాలు అందరాదని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అభిప్రాయపడింది. మతం మారిన వారు కుల ఆధారిత రిజర్వేషన్‌తోపాటు మైనారిటీ హోదాల్లోనూ ప్రయోజనం పొందుతున్నారని వీహెచ్‌పీ జాతీయ ప్రతినిధి విజయ్ శంకర్ తివారీ అన్నారు. శుక్రవారం నాగ్‌పూర్(మహారాష్ట్ర) ధన్తోలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే ఇలా రెండు ప్రయోజనాలు పొందటాన్ని తాము అడ్డుకుంటామని తివారీ చెప్పారు. ఈ ప్రయోజనాలను ఆశించే చాలా మంది మతం మారుతున్నారన్నారు. కేంద్రం కూడా ఈ దిశగా రిజర్వేషన్లు అందకుండా చూసే ప్రణాళిక రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మత మార్పిడుల కోసం పలు ప్రయత్నాలు ఊపందుకున్నాయని, అలాంటి కార్యకలాపాలను ఎదుర్కోవడానికి వీహెచ్‌పీ తరపున ఒక కార్యాచరణను రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇదీ చదవండి: మత విద్వేష ప్రసంగాలపై సుప్రీం సీరియస్ -
మత మార్పిడి చేసుకున్న వారికి ఎస్సీ హోదాపై కేంద్రం అధ్యయనం
న్యూఢిల్లీ: వేరే మతంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా ఇవ్వాలా వద్దా అనే విషయాన్ని తేల్చేందుకు కేంద్రం సమాయత్తమైంది. ఇందుకోసం కేంద్రప్రభుత్వం అధ్యయనం చేయనుంది. ఇందుకోసం మాజీ సీజేఐ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో ఒక కమిషన్‌ను ఏర్పాటుచేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్న మతాల్లోకి కాకుండా వేరే మతాల్లోకి మారిన వారికీ ఎస్సీ హోదా ఇవ్వొచ్చా లేదా అనే విషయాన్ని ఈ కమిషన్ తేల్చనుంది. మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ రవీందర్ కుమార్ జైన్, యునివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సభ్యురాలు సుష్మా యాదవ్‌లతో ఈ త్రిసభ్య కమిషన్‌ను కొలువుతీరుస్తూ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ గురువారం ఒక నోటిఫికేషన్ విడుదలచేసింది. రాజ్యాంగంలోకి 341 ఆర్టికల్ ప్రకారం గతంలో పలు సందర్భాల్లో జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులను, ప్రస్తుత పరిస్థితులను కమిషన్ పరిశీలించనుంది. వేరే మతం వారికి ఎస్సీ హోదా ఇస్తే ఇప్పటికే ఎస్సీ హోదా లబ్ధిపొందుతున్న వారి ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక వివక్ష, పేదరికం వంటి అంశాలపై ఏ మేరకు ప్రభావం పడుతుంది అనే అంశాలనూ కూలంకషంగా కమిషన్ అధ్యయనం చేయనుంది. -
మతం మారితే బహిరంగపరచాలి
ధార్వాడ్: మత మార్పిడుల్ని నిరోధించాలని, ఒకవేళ ఎవరైనా మతం మారితే బహిరంగంగా వెల్లడించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అభిప్రాయపడింది. మత మార్పిడి నిరోధక చట్టాన్ని ఏ రాష్ట్రమైనా తీసుకువస్తే తాము స్వాగతిస్తామని స్పష్టం చేసింది. అఖిల భారతీయ కార్యకారి మండల్ (ఏబీకేఎం) మూడు రోజుల సమావేశం ముగిసిన అనంతరం ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే శనివారం మీడియాతో మాట్లాడారు. మతమార్పిడుల్ని నిరోధించాలన్నదే ఆరెస్సెస్ విధానమన్నారు. ఒకవేళ ఎవరైనా మతం మార్చుకుంటే దానిని బహిరంగంగా వ్యక్తపరచాలని డిమాండ్ చేశారు. మతం మారిన తర్వాత కూడా బయటపెట్టకపోతే వారు రెండు రకాలుగా లబ్ధిని పొందుతున్నారని అన్నారు. బలవంతపు మత మార్పిడుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదని అన్నారు. అందుకే మత మార్పిడి నిరోధక చట్టాన్ని మైనార్టీలు వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. బలవంతగా మత మార్పిడిని ఆరెస్సెసే కాదు మహాత్మా గాంధీ కూడా వ్యతిరేకించారని చెప్పారు. దేశంలో ఇప్పటివరకు పదికి పైగా రాష్ట్రాలు మత మార్పిడి వ్యతిరేక చట్టాన్ని తీసుకువచ్చాయన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ హయాంలో వీరభద్ర సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ చట్టాన్ని తీసుకువచ్చారని ఆయన గుర్తు చేశారు. -
మతం – అభిమతం
మత మార్పిడుల వ్యవహారం మన దేశంలో తరచు వివాదాస్పదమవుతోంది. ఈమధ్య కాలంలో బీజేపీ ఏలుబడిలోని మూడు రాష్ట్రాలు–ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లు మత మార్పిడుల నిరోధానికి ఆర్డినెన్సులు, చట్టాలు తీసుకొచ్చాయి. తాము అధికారంలోకొస్తే అలాంటి చట్టాన్ని తీసుకొస్తామని తమిళనాడులో బీజేపీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరమైనవి. బెదిరింపులు, వేధింపులు, మభ్యపెట్టడం ద్వారా దేశంలో కొందరు మత మార్పిడులకు పాల్పడుతున్నారని వీటిని నియంత్రించటానికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం తమ ముందుకొచ్చినప్పుడు ధర్మాసనం కటువైన వ్యాఖ్యలు చేసింది. 18 ఏళ్లకు పైబడిన వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని ఎంపిక చేసుకోవటాన్ని ఎందుకు నిరోధించాలని జస్టిస్ ఆర్ ఎఫ్ నారిమన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ప్రశ్నించింది. ఇలాంటి పిటిషన్లు ప్రజా ప్రయోజనానికి చాలా చాలా హాని కలిగించేవని, ఈ పిటిషన్ ప్రచార ప్రయోజన వ్యాజ్యం తప్ప మరేమీ కాదని దుయ్యబట్టింది. చివరకు పిటిషనర్ ఆ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోక తప్పలేదు. మన రాజ్యాంగంలోని 25వ అధికరణ ఏ మతాన్నయినా స్వేచ్ఛగా అవలంబించటానికి, ప్రచారం చేసుకోవటానికి అనుమతినిస్తోంది. అయితే శాంతిభద్రతలకు, నైతికతకు, ప్రజల ఆరోగ్యానికి భంగం వాటిల్లకుండా ఈ హక్కును వినియోగించుకోవచ్చునని నిర్దేశిస్తోంది. మతాన్ని కించపరచ డానికి ప్రయత్నించటం, వేరే మతస్తుల మనోభావాలను దెబ్బతీయటం వగైరాలకింద చర్యలు తీసుకోవటానికి వీలు కల్పిస్తున్న భారతీయ శిక్షాస్మృతిలోని 295ఏ, 298 సెక్షన్లను బలవంతపు మతమార్పిడి జరిగిందని అనుమానం వచ్చిన సందర్భాల్లో వినియోగిస్తున్నారు. మత మార్పిడులకు వ్యతిరేకంగా పదేళ్లక్రితం చట్టాలు చేసిన రాష్ట్రాలు సైతం అందుకు సంబంధించి నిబంధనలు రూపొందించటంలో అయోమయం తలెత్తటం వల్ల వాటిని నిలిపివుంచాయి. ఈ మధ్య ఉత్తరప్రదేశ్ ‘వివాహం కోసం మతం మారటాన్ని’ నిషేధిస్తూ ఆర్డినెన్సు తీసుకొచ్చింది. దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లు విచారణలో వున్నాయి. మతమార్పిడులు జరుగుతున్నాయనే అభిప్రాయాన్ని కలగజేసి, అలాంటి ప్రచారం ద్వారా లబ్ధి పొందేందుకు రాజకీయ నాయకులు వెరవడం లేదు. ఈ ధోరణి సామాన్య పౌరులకు ఎలాంటి చిక్కులు తెచ్చిపెడుతున్నదో చెప్పడానికి ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగిన ఉదంతమే ఉదాహరణ. క్రైస్తవ సన్యాసినులతో కలిసి ఇద్దరు యువతులు రైల్లో వెళ్తుండగా, వారితోపాటే ప్రయాణిస్తున్న ఒక గుంపు వారిని శంకించింది. బలవంతంగా మత మార్పిడి చేయించటానికే ఆ ఇద్దరు యువతులనూ తీసుకెళ్తున్నారన్న అభిప్రాయం వారికేర్పడింది. దాంతో రైలు ఆగిపోయింది. అక్కడికక్కడ ‘విచారణ’ మొదలైపోయింది. తాము మతం మారడంలేదని, తాము కూడా పుట్టుకతో ఆ మతానికే చెందినవారమని యువతులు చెబుతున్నా ఎవరూ వినిపించుకోలేదు. వెంటనే పోలీ సులు రావటం, వారిని ప్రశ్నించటం కోసం పోలీస్‌స్టేషన్‌కు తరలించడం పూర్తయింది. ఆ తర్వాత వారిని విడిచిపెట్టారు. కానీ ప్రయాణం వాయిదా పడింది. సహ ప్రయాణికులకు ఇబ్బంది కలి గించటం, రైల్లో నేరానికి పాల్పడటం, టిక్కెట్ లేకుండా ప్రయాణించటంతోసహా ఎన్నో కారణాలు రైల్లోనుంచి దింపేయటానికి దారితీయడం ఎప్పటినుంచో వింటున్నదే. కానీ మత మార్పిడి అనుమానం కలిగినా ప్రయాణం ఆగిపోతుందని ఝాన్సీ ఉదంతం నిరూపించింది. నిజానికి మత మార్పిడులకు సంబంధించిన చర్చ చాలా పాతది. 1954లోనే మత మార్పిడులను క్రమబద్ధీకరించే బిల్లును పార్లమెంటు పరిశీలించింది. అలాగే 1960లో వెనకబడిన వర్గాల(మత పరిరక్షణ) బిల్లు ముసాయిదా సైతం రూపొందింది. అయితే ఆ రెండూ అంతకన్నా ముందుకు పోలేదు. 1967లో ఒరిస్సా మత స్వేచ్ఛ చట్టం తీసుకొచ్చినా రాజ్యాంగంలోని 25వ అధికరణ స్ఫూర్తికి అది విరుద్ధమని అక్కడి హైకోర్టు కొట్టివేసింది. అయితే వేరొకరిని తన మతంలోకి మార్చే హక్కు ఎవరికీ వుండబోదని, అది రాజ్యాంగంలోని 25వ అధికరణకిందకు రాదని 1977లో ఒక కేసులో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ‘మత స్వేచ్ఛకు రాజ్యాంగమే పూచీపడుతున్నప్పుడు ఆ విషయంపై రాజ్యం ఆందోళన చెందాల్సిన అవసరమేమిటి?’ అని ఒక సందర్భంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ణ ప్రశ్నించారు. ఒక పార్టీ గుర్తుపై ఎన్నికైన ప్రజా ప్రతినిధులు వేరే పార్టీలోకి ఫిరాయిస్తే అది తప్పని, ప్రజా భీష్టానికి విరుద్ధమని... అంతిమంగా ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి చేటు కలిగిస్తాయని గుర్తిం చనివారికి కూడా ఎవరైనా మతం మార్చుకుంటే అభ్యంతరం అనిపిస్తోంది. అందువల్ల ఏదో అయిపోతుందనే భయం కలుగుతోంది. రాజకీయ స్వప్రయోజనాలే ఇందుకు కారణమని సులభం గానే చెప్పొచ్చు. తమను బలవంతంగా మతం మార్చారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే వేరు. కానీ ఎలాంటి సమస్య తలెత్తకుండా వివాదాన్ని రేకెత్తించటానికి చూడటం సరికాదు. తోటి పౌరుల వ్యక్తిగత నిర్ణయాల విషయంలో జోక్యం చేసుకోరాదన్న స్పృహ అందరిలో కలగవలసిన అవసరాన్ని సుప్రీంకోర్టు తీర్పు గుర్తుచేస్తోంది. ఈ అంశంపై మన దేశంలో తరచు తలెత్తుతున్న వివాదాలకు ధర్మాసనం వ్యాఖ్యలు ముగింపు పలుకుతాయని ఆశించాలి. -
మతం మారడాన్ని ప్రోత్సాహించను: రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లి పేరుతో జరుగుతున్న మతమార్పిడిలపై చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే. యూపీ, మధ్యప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక ఆర్డినెన్స్‌ని కూడా తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివాహం కోసం జరిగే మత మార్పిడిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా తాను ఇలాంటి వాటిని సమర్థించనని స్పష్టం చేశారు. న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో ఇంటర్వ్యూలో భాగంగా రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అసలు మతం ఎందుకు మారాలి. సామూహిక మత మార్పిడి వ్యవహారాలు ఆగిపోవాలి. నాకు తెలిసినంత వరకు ముస్లిం మతం ఇతర మతస్తులను వివాహం చేసుకోవడానికి అంగీకరించదు. ప్రస్తుతం అనేక కేసుల్లో కేవలం వివాహం కోసం.. బలవంతంగా.. చెడు ఉద్దేశంతో మత మార్పిడి జరుగుతుంది. సహజ వివాహ ప్రక్రియకు.. ఈ బలవంతపు మత మార్పిడి వివాహ తంతుకు చాలా తేడా ఉంది. ఇందుకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తోన్న ప్రభుత్వాలు ఈ విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆర్డినెన్స్ తీసుకువచ్చాయి అని భావిస్తున్నాను. నా వరకు మత మార్పిడిలను నేను ప్రోత్సాహించను’ అన్నారు రాజ్‌నాథ్ సింగ్. (చదవండి: యోగికి షాకిచ్చిన ఐఏఎస్ అధికారులు) ఇక ఈ ఇంటర్వ్యూలో రాజ్‌నాథ్ రైతుల ఉద్యమం, చైనా-భారత్ సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన వంటి అంశాలపై మాట్లాడారు. తాను ఓ రైతు బిడ్డనని.. వారి కష్టం తనకు బాగా తెలుసన్నారు. అలానే మోదీ ప్రభుత్వం అన్నదాతలకు మేలు చేస్తుంది తప్ప నష్టం చేకూర్చదని స్పష్టం చేశారు. ఇక చైనాతో చర్చలు కొనసాగుతన్నప్పటికి పెద్దగా ఫలితం లేదని స్పష్టం చేశారు రాజ్‌నాథ్ సింగ్. -
హథ్రాస్ ఆగ్రహం.. 50 కుటుంబాలు మత మార్పిడి
లక్నో: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్ కేసులో చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల బాధితురాలి సామాజిక వర్గం(వాల్మీకి) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దాంతో ఆ వర్గానికి చెందిన 50 కుటుంబాలకు చెందిన 236 మంది ప్రజలు బౌద్ధమతాన్ని స్వీకరించినట్లు సమాచారం. ఈ సంఘటన ఘజియాబాద్‌లోని కర్హేడా ప్రాంతంలో అక్టోబర్ 14న చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న వాల్మీకి వర్గానికి చెందిన 236 మంది ప్రజలందరు బౌద్ధమతాన్ని స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ ముని ముని మనవడు రాజరత్న సమక్షంలో వీరు బౌద్ధంలోకి మారారు. హథ్రాస్ సంఘటనతో తాము బాధపడ్డామని, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొన్నప్పటికీ, నాయకులు, అధికారులు వారి బాధలు వినలేదని కుటుంబాలు ఆరోపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఉంది. దీనిలో రాజరత్న అంబేద్కర్, వాల్మీకి వర్గ ప్రజలను బౌద్ధమతంలోకి ప్రవేశపెట్టడాన్ని చూడవచ్చు. వీరందరు భారత బౌద్ధ సర్వసభ్య ధృవీకరణ పత్రం కూడా పొందారు. (చదవండి: హథ్రస్ కేసు: ఆ రైతు పాలిట శాపంగా..) బౌద్ధమతంలోకి వెళ్ళిన ప్రజలలో ఒకరైన బిర్ సింగ్ మాట్లాడుతూ, “మా గ్రామంలోని 50 కుటుంబాలకు చెందిన 236 మంది మహిళలు, పిల్లలతో సహా బౌద్ధమతంలోకి మారాము. దీనికి ఎటువంటి ఫీజు తీసుకోలేదు. బౌద్ధమతాన్ని స్వీకరించిన తరువాత, సామాజిక సేవ వంటి మంచి కార్యకలాపాలను చేపట్టాలని మాకు బోధించారు" అని తెలిపారు. ఇక సెప్టెంబర్ 14 న, హథ్రాస్‌లోని బుల్గాది గ్రామంలో వాల్మీకి వర్గానికి చెందిన బాలికపై సామూహిక అత్యాచారం, హత్యతో ఆగ్రహం చెలరేగింది. ఈ సంఘటన తరువాత, వాల్మీకి సమాజ్ నిరసన వ్యక్తం చేసి వివిధ ప్రదర్శనలు నిర్వహించింది. ప్రస్తుతం సీబీఐ ఈ కేసును విచారిస్తోంది. నలుగురు నిందితులను అలీగఢ్ జైలులో ఉంచారు. -
పాక్‌లో ఇద్దరు హిందూ బాలికల కిడ్నాప్
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పాకిస్తాన్లో ఇద్దరు హిందూ బాలికలను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేయడంతో పాటు మత మార్పిడి చేయించిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. పాక్‌లోని ఘోట్కి జిల్లాలో హోలీ సందర్భంగా రవీనా (13), రీనా (15) అనే హిందు బాలికలను ఇంటి నుంచి అపహరించిన కొందరు.. తర్వాత వారికి ఓ ముస్లిం మత గురువు చేతుల మీదుగా మత మార్పిడి చేసి నిఖా నిర్వహించిన వీడియో ఆ దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో అక్కడ ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ నిర్వహించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఆదేశించారు. పూర్తి వివరాలను బయటపెట్టాల్సిందిగా సింధ్, పంజాబ్ ప్రభుత్వాలను ఆదేశించారు. భారత రాయబారిని నివేదిక కోరిన సుష్మ పాక్‌లో చోటుచేసుకున్న ఘటనపై భారత్ స్పందించింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, పాక్ మంత్రి ఫవాద్ చౌద్రీల మధ్య ఈ వ్యవహారంపై ఆదివారం ట్విట్టర్లో వాగ్యుద్ధమే జరిగింది. ఫవాద్ చౌద్రీ స్పందిస్తూ.. ‘ఇది పాక్ అంతర్గత విషయం. మైనారిటీలను అణచివేయడానికి ఇదేం భారత్‌లోని మోదీ ప్రభుత్వం కాదు. ఇది ఇమ్రాన్‌ఖాన్ పాలనలోని కొత్త పాక్. మా జెండాలోని తెల్లరంగులా మేము వారిని సమానంగా చూసుకుంటాం. ఇదే శ్రద్ధని భారత్‌లోని మైనారిటీల విషయంలోనూ చూపిస్తారని ఆశిస్తున్నాం.’అని ట్వీట్ చేశారు. దీనికి ప్రతిగా సుష్మ స్పందిస్తూ.. ‘ఈ విషాదకర ఘటనపై మీ స్పందన చూస్తుంటే మీలోని దోషపూరిత మనస్తత్వాన్ని బయటపెడుతోంది..’అని ట్వీట్లో బదులిచ్చారు. -
బచావత్ నుంచి బ్రిజేశ్ దాకా..
కృష్ణా నీళ్లపై దశాబ్దాలుగా కొనసాగుతున్న లొల్లి సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదంపై 1969లో ఆర్ఎస్ బచావత్ ఆధ్వర్యంలో కేంద్రం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ 1973లో తీర్పు వెల్లడించింది. దీన్ని పునఃపరిశీలించాల్సిందిగా 2002లో ఉమ్మడి ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలు సుప్రీంకోర్టును కోరాయి. దాంతో 2004 ఏప్రిల్‌లో బ్రిజేశ్‌కుమార్ ఆధ్వర్యంలో కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. ఆ ట్రిబ్యున ల్ ప్రస్తుతం వరకు కొనసాగుతూ వస్తోంది. కృష్ణా జలాల వివాదాల కథ ఇదీ.. ⇔ ఏప్రిల్ 10, 1969: జస్టిస్ బచావత్ నేతృత్వంలో కృష్ణా జల వివాదాల పరిష్కార మండలి (కేడబ్ల్యూడీటీ-1)ని కేంద్రం ఏర్పాటు చేసింది ⇔ డిసెంబర్ 13, 1973: మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపిణీ చేస్తూ బచావత్ ట్రిబ్యునల్ కేంద్రానికి మధ్యంతర నివేదిక ఇచ్చింది ⇔ మే 31, 1976: కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఆంధ్రప్రదేశ్‌కు 811(నీటి పునర్వినియోగంతో కలపి) టీఎంసీలు కేటాయిస్తూ బచావత్ ట్రిబ్యునల్ తుది తీర్పునిచ్చింది. మిగులు జలాలపై పూర్తి హక్కు దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు ఉంటుందని తేల్చి చెప్పింది. మే 31, 2000 తర్వాత ఈ తీర్పును పునఃసమీక్ష చేయవచ్చునని పేర్కొంది. ⇔ ఏప్రిల్ 2, 2004: మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లు బచావత్ తీర్పును పునఃసమీక్షించాలని కోరడంతో జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ అధ్యక్షతన జస్టిస్ ఎస్పీ శ్రీవాత్సవ, జస్టిస్ డీకే సేత్‌లు సభ్యులుగా కృష్ణా జల వివాదాల పరిష్కార మండలి(కేడబ్ల్యూడీటీ-2)ను కేంద్రం ఏర్పాటు చేసింది ⇔ డిసెంబర్ 30, 2010: బచావత్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చేసిన కేటాయింపులపై పునఃసమీక్ష చేయకుండా.. 65 శాతం నీటి లభ్యత ఆధారంగా మిగులు జలాలను మూడు రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పు ఇచ్చింది. మహారాష్ట్రకు 666, కర్ణాటకకు 911, ఆంధ్రప్రదేశ్‌కు 1001 టీఎంసీలు కేటాయించింది. మిగుల జలాలపై ఉన్న హక్కును రద్దు చేయడంతో ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ⇔సెప్టెంబర్ 16, 2011: తాము తీర్పు ఇచ్చే వరకూ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేయకూడదని.. గెజిట్ ప్రచురించకూడదంటూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ⇔నవంబర్ 29, 2013: మొదటి తీర్పును సవరిస్తూ బ్రిజేశ్ ట్రిబ్యునల్ తుది తీర్పునిచ్చింది. కర్ణాటకు కేటాయించిన జలాల్లో 4 టీఎంసీలను మాత్రమే ఏపీకి అదనంగా కేటాయించింది ⇔జనవరి 16, 2014: కృష్ణా జలాల పంపిణీలో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌లో అన్యాయం జరిగిందంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా నీటిని పంపిణీ చేయాలని.. మిగుల జలాలపై బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన హక్కును కొనసాగించాలని కోరింది. ఇదే సమయంలో తమకు కేటాయించిన నీటిలో 4 టీఎంసీలు కోత వేయడాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక.. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేయాలంటూ మహారాష్ట్ర సుప్రీంకోర్టును ఆశ్రయించాయి ⇔ ఫిబ్రవరి 20, 2014: ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో కృష్ణా ట్రిబ్యునల్ గడువును పొడిగిస్తూ విభజన చట్టంలో సెక్షన్ 89లో కేంద్రం పేర్కొంది ⇔ ఆగస్టు 1, 2014: ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ గడువును మరో రెండేళ్లు పొడగించింది ⇔ ఆగస్టు 1, 2016: బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ గడువు ముగియడంతో మరో ఆర్నెళ్లు పొడగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది ⇔ సెప్టెంబర్ 8, 2016: కృష్ణా జలాల పంపిణీని నాలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ పంపిణీ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కోరాయి. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం 75 శాతం నీటి లభ్యత ఆధారంగానే నీటిని పంపిణీ చేయాలని.. మిగులు జలాలపై హక్కును తమకే వదిలేయాలని ఏపీ, తెలంగాణ వాదించాయి. వీటిని మహారాష్ట్ర, కర్ణాటక వ్యతిరేకించాయి. ఏపీ, తెలంగాణ వాదనలను పరిగణనలోకి తీసుకోని కేంద్రం.. మహారాష్ట్ర, కర్ణాటకలకు వంత పాడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్యే నీటిని పంపిణీ చేయాలని బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు, సుప్రీంకోర్టుకు అఫిడవిట్లు సమర్పించింది. ⇔ అక్టోబర్ 19, 2016: కృష్ణా జలాల పునఃపంపిణీ ఏపీ, తెలంగాణలకు మాత్రమే పరిమితమని బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై రెండు వారాల్లోగా అభిప్రాయాలు చెప్పాల్సిందిగా ఏపీ, తెలంగాణకు సూచించింది. -
150 మంది గిరిజన క్రైస్తవుల మత మార్పిడి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లా రామ్పుర్హత్ ప్రాంతంలో బుధవారం విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) నిర్వహించిన కార్యక్రమంలో దాదాపు 150 మంది గిరిజన క్రైస్తవులు హిందూమతం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి వెయ్యి మంది వరకు హాజరయ్యారు. ‘ఇది మతమార్పిడి కాదు. గిరిజనులు స్వచ్ఛందంగా మతం మారారు’ అని వీహెచ్‌పీ నాయకుడు సచ్చింద్రనాథ్ సింఘా తెలిపారు. -
మత మార్పిడి పరిష్కారమా!
మన దేశంలో ప్రస్తుతం జరగాల్సినవి స్థితి మార్పిడులే కానీ మత మార్పిడులు కావు. దేశంలో నేడు నెలకొన్న పరిస్థితుల్లో అత్యవసరంగా జరగాల్సినవి పేదల ఆర్థికస్థితి మార్పిడులు. దేశ జనాభాలో మూడొంతుల మంది దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారు. రైతులు తగ్గి, రైతు కూలీ లు పెరిగిన వైనం వ్యవసాయ రంగ సంక్షోభానికి నిదర్శనం. ఈ పరిస్థి తిని మార్చేందుకు ప్రభుత్వం పూనుకోవాలి. అయితే ప్రస్తుతం దేశంలో జరుగుతున్న వ్యవహారాలు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వం ఉదాసీనత తోనో, పరోక్ష మద్దతుతోనో మతమార్పిడులు చోటుచేసుకుంటున్నాయి. మతం అన్నది వ్యక్తిగత వ్యవహారం. దాన్ని అలానే ఉండనివ్వాలి. రాజ్యాంగ నిబంధన 25(1) ‘ఎవరైనా తమ మతాన్ని అనుసరించమని ఇతరుల్ని ఒప్పించవచ్చు గానీ భయపెట్టో, లేనిపోని ఆశలు కల్పించడం ద్వారానో బలవంతపెట్టడం చేయరాదని’ చెప్తోంది. 1977లో సుప్రీం కోర్టు కేరళ మతమార్పిడి వ్యతిరేక చట్టాన్ని సమర్థిస్తూ అదేమాట చెప్పిం ది. అలాంటి కార్యక్రమాల ద్వారా సామాజిక ఆందోళన తలెత్తే పరిస్థితి ఉత్పన్నమైతే ప్రభుత్వం చర్య తీసుకోవచ్చని తెలిపింది. అయితే ఈ వ్యవహారాల్లో వేలుపెట్టడం లేనిపోని సమస్యలు సృష్టించే అవకాశము న్నందున, ప్రభుత్వం దీనిని ఆదిలోనే నివారించాలి. - డా.డి.వి.జి.శంకరరావు మాజీ ఎంపీ,పార్వతీపురం, విజయనగరం జిల్లా -
మత మార్పిడి పరిష్కారమా!
మన దేశంలో ప్రస్తుతం జరగాల్సినవి స్థితి మార్పిడులే కానీ మత మార్పిడులు కావు. దేశంలో నేడు నెలకొన్న పరిస్థితుల్లో అత్యవసరంగా జరగాల్సినవి పేదల ఆర్థికస్థితి మార్పిడులు. దేశ జనాభాలో మూడొంతుల మంది దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారు. రైతులు తగ్గి, రైతు కూలీ లు పెరిగిన వైనం వ్యవసాయ రంగ సంక్షోభానికి నిదర్శనం. ఈ పరిస్థి తిని మార్చేందుకు ప్రభుత్వం పూనుకోవాలి. అయితే ప్రస్తుతం దేశంలో జరుగుతున్న వ్యవహారాలు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వం ఉదాసీనత తోనో, పరోక్ష మద్దతుతోనో మతమార్పిడులు చోటుచేసుకుంటున్నా యి. మతం అన్నది వ్యక్తిగత వ్యవహారం. దాన్ని అలానే ఉండనివ్వాలి. రాజ్యాంగ నిబంధన 25(1) ‘ఎవరైనా తమ మతాన్ని అనుసరించమని ఇతరుల్ని ఒప్పించవచ్చు గానీ భయపెట్టో, లేనిపోని ఆశలు కల్పించడం ద్వారానో బలవంతపెట్టడం చేయరాదని’ చెప్తోంది. 1977లో సుప్రీం కోర్టు కేరళ మతమార్పిడి వ్యతిరేక చట్టాన్ని సమర్థిస్తూ అదేమాట చెప్పిం ది. అలాంటి కార్యక్రమాల ద్వారా సామాజిక ఆందోళన తలెత్తే పరిస్థితి ఉత్పన్నమైతే ప్రభుత్వం చర్య తీసుకోవచ్చని తెలిపింది. అయితే ప్రభుత్వం ఈ వ్యవహారాల్లో వేలుపెట్టడం లేనిపోని సమస్యలు సృష్టిం చే అవకాశమున్నందున, ప్రభుత్వం ఆదిలోనే నివారించాలి. - డా.డి.వి.జి.శంకరరావు మాజీ ఎంపీ,పార్వతీపురం, విజయనగరం, జిల్లా -
హిందువుల జనాభా పెంచండి
వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యాధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా సామ్రాజ్యంలా విస్తరించాలని పిలుపు నలుగురు భార్యల విధానం తొలగిపోవాలి ఘనంగా భాగ్యనగర్ హిందూశక్తి సంగమం సాక్షి, హైదరాబాద్: హిందూ మతానికి చెందిన ఏ ఒక్కరూ మత మార్పిడి ప్రభావానికి లోనుకావద్దని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యాధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా పిలుపునిచ్చారు. దేశంలో నానాటికి హిందువుల జనాభా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ పాత రోజులు రావాలని, దేశంలో వంద శాతం హిందువులు ఉండాలని ఆకాంక్షించారు. ముస్లింలు, క్రైస్తవులు ఎవరైనా హిందువుల్లో కలవాలనుకుంటే వారిని మనసారా ఆహ్వానిస్తున్నామని, వారిని తమలో కలుపుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) స్వర్ణజయంతి మహోత్సవాలను పురస్కరించుకొని ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివారం భాగ్యనగర్ హిందూశక్తి సంగమం పేరుతో నిర్వహించిన హనుమాన్ చాలీసా కోటి పారాయణ యజ్ఞం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. హిందువులు ఉత్సవాలు జరుపుకోవాలంటే అయోధ్యలో రామమందిరం నిర్మించాల్సిందేనన్నారు. కశ్మీర్లో ఉన్న నాలుగు లక్షల మంది హిందువులు సురక్షితంగా ఉన్నప్పుడే అందరూ ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. ఈ భూమి మీద గోవధ జరగనప్పుడే హిందువులకు నిజమైన సంబరాలని అన్నారు. హిందువుల సంఖ్య తగ్గితే భవిష్యత్‌లో మందిరాలు ఉండవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు బంగ్లాదేశ్‌లో 30 శాతంగా ఉన్న హిందువులు 8 శాతానికి తగ్గిపోయారని, పాకిస్తాన్లో పది శాతం ఉన్నవారు ఒక శాతానికి పడి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాలో ఒకప్పుడు నూరు శాతం ఉన్న హిందూ జనాభా రోజు రోజుకు తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నలుగురు భార్యల సంస్కృతి తొలగిపోవాలన్నారు. భారత్‌లో తగ్గిపోతున్న హిందూ జనాభాను పెంచుకోవాలని సూచించారు. ఏ ఒక్క హిందువు కూడా విద్యా, వైద్య సౌకర్యాలు లేకుండా ఉండకూడదన్నారు. ఆకలితో అలమటించకూడదని అన్నారు. అత్యవసర సమయాల్లో వైద్యం అవసరమైన హిందువులు 1860 2333 666 నంబర్లో సంప్రదించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉర్దూ అకాడమీకి 30 కోట్ల రూపాయలు కేటాయించి, తెలుగు అకాడమీకి 30 లక్షల రూపాయలను కేటాయించడాన్ని ఆయన తప్పు పట్టారు. ముస్లింలను హజ్‌కు, క్రైస్తవులను జెరూసలెంకు పంపుతున్న ప్రభుత్వాలు హిందువులను ఏ ఒక్కరినైనా తిరుపతికి పంపిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. హిందువుల కోసం ఆలోచించే నాయకులను మాత్రమే ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కమలానంద భారతి స్వామి మాట్లాడుతూ మన దేశంలో ఏ వారసత్వానికైనా, ఏ సంప్రదాయానికైనా వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. 2300 సంవత్సరాల క్రితం మేకల కాపరి రాజ్యాన్ని పరిపాలిస్తే, నేడు చాయ్‌వాలా దేశాన్ని పరిపాలిస్తున్నాడని పేర్కొన్నారు. భగవంతుడికి జన్మనిచ్చింది హిందువేనన్నారు. యుగాలు తరాలు మారినా ధర్మం మారదన్నారు. అలాంటి ధర్మమే హిందూ ధర్మమని కొనియాడారు. హిందూ ధర్మంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీత్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి, మంత్రాలయం మఠాధిపతి సుభుదేంద్ర తీర్థస్వామి, ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ సురేష్ జోషిజీ, వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి, విశ్వ హిందూ పరిషత్ నాయకుడు కేశవరాజు, స్వర్ణ జయంతి మహోత్సవ సమితి ప్రాంత అధ్యక్షులు త్రిపురనేని హనుమాన్ చౌదరి, భాగ్యనగర్ అధ్యక్షుడు నంగునూరి చంద్రశేఖర్లతో పాటు అనేక మంది పీఠాధిపతులు, మఠాధిపతులు పాల్గొన్నారు. -
‘మతమార్పిడి’పై పట్టువీడని ప్రతిపక్షం
ఉభయ సభలను అడ్డుకున్న విపక్షాలు న్యూఢిల్లీ: మత మార్పిడుల అంశంపై సోమవారం రాజ్యసభ కార్యకలాపాలు స్తంభించగా.. లోక్‌సభలో ప్రకంపనలు సృష్టించింది. మత మార్పిడుల అంశం రాష్ట్రాల పరిధిలోనిదని, వాటితో ప్రభుత్వానికి, బీజేపీకి సంబంధం లేదని ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు ఇచ్చిన సమాధానం విపక్షాలను తృప్తి పర్చలేదు. గత వారపు తమ నిరసనను కొనసాగిస్తూ ప్రతిపక్షాలు రాజ్యసభలో సోమవారం ఉదయమే ఈ అంశాన్ని లేవనెత్తాయి. దానికితోడు బీజేపీ ఎన్నికల హామీలైన నల్లధనం వెలికితీత, ఉపాధి కల్పనలపై నినాదాలు చేస్తూ, ‘ప్రధాని జవాబివ్వండి’, ‘పీఎంజీ, నల్లధనం వెనక్కు తెండి’ అనే ప్లకార్డులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్, ఎస్పీ, జేడీయూ, టీఎంసీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. ‘నో పీఎం.. నో హౌజ్’ అంటూ కాంగ్రెస్ సభ్యులు జతకలిసి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. చర్చ పూర్తయినందున మరోసారి దీనిపై చర్చ సాధ్యం కాదని అధికారపక్ష నేత అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ప్రధాని సభకు వచ్చి మతమార్పిడులపై సభ్యుల ఆందోళనలకు సమాధానమివ్వాలని కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న కీలక బిల్లుల ఆమోదానికి సహకరించాలన్న వెంకయ్య అభ్యర్థనను విపక్షం చెవిన పెట్టలేదు. ఉదయం నుంచీ మధ్యాహ్నం 3 గంటల వరకు నాలుగు సార్లు వాయిదా పడిన సభ.. విపక్షాలు శాంతించకపోవడంతో మంగళవారానికి వాయిదా పడింది. ఈ వివాదం లోక్‌సభనూ కుదిపేసింది. ప్రధాని జవాబివ్వాలన్న కాంగ్రెస్, వామపక్షాలు, ఆర్జేడీ, జేడీయూ సభ్యుల నిరసనలు రెండు సార్లు సభ వాయిదాకు కారణమయ్యాయి. మీది గాంధీ పరివార్.. నాది సంఘ్ పరివార్ ఆరెస్సెస్ నేపథ్యం తనకు గర్వకారణమన్న వెంకయ్య ఇటీవలి వ్యాఖ్యలను ఖర్గే గుర్తు చేశారు. దాంతో.. ‘మీకు గాంధీ పరివార్(కుటుంబం) గర్వకారణం. నాకు సంఘ్‌పరివార్ గర్వకారణం’ అని వెంకయ్య వ్యంగ్యంగా బదులిచ్చారు. ‘వెంకయ్య కుర్చీలో స్ప్రింగ్‌లున్నాయేమో, మాటిమాటికీ లేచి నిల్చుని మాట్లాడుతున్నార’న్న ఖర్గే వ్యాఖ్యపై.. ‘మాది క్రియాశీల ప్రభుత్వం. విపక్ష వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేకున్నా జవాబిస్తున్నాం’ అని అన్నా రు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా విపక్షాలు వా కౌట్ చేశాయి. కాగా, ఈ వివాదానికి ముగింపు ఏ విధంగా పలకాలన్న దానిపై మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో బీజేపీ, సంఘ్ కీలక నేతలు సోమవారం సమావేశమై చర్చలు జరిపారు. -
‘మతమార్పిడి’పై పట్టువీడని ప్రతిపక్షం
ఉభయ సభలను అడ్డుకున్న విపక్షాలు న్యూఢిల్లీ: మత మార్పిడుల అంశంపై సోమవారం రాజ్యసభ కార్యకలాపాలు స్తంభించగా.. లోక్‌సభలో ప్రకంపనలు సృష్టించింది. మత మార్పిడుల అంశం రాష్ట్రాల పరిధిలోనిదని, వాటితో ప్రభుత్వానికి, బీజేపీకి సంబంధం లేదని ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు ఇచ్చిన సమాధానం విపక్షాలను తృప్తి పర్చలేదు. గత వారపు తమ నిరసనను కొనసాగిస్తూ ప్రతిపక్షాలు రాజ్యసభలో సోమవారం ఉదయమే ఈ అంశాన్ని లేవనెత్తాయి. దానికితోడు బీజేపీ ఎన్నికల హామీలైన నల్లధనం వెలికితీత, ఉపాధి కల్పనలపై నినాదాలు చేస్తూ, ‘ప్రధాని జవాబివ్వండి’, ‘పీఎంజీ, నల్లధనం వెనక్కు తెండి’ అనే ప్లకార్డులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్, ఎస్పీ, జేడీయూ, టీఎంసీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. ‘నో పీఎం.. నో హౌజ్’ అంటూ కాంగ్రెస్ సభ్యులు జతకలిసి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. చర్చ పూర్తయినందున మరోసారి దీనిపై చర్చ సాధ్యం కాదని అధికారపక్ష నేత అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ప్రధాని సభకు వచ్చి మతమార్పిడులపై సభ్యుల ఆందోళనలకు సమాధానమివ్వాలని కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఓ కీలక బిల్లు ఆమోదానికి సహకరించాలన్న వెంకయ్య అభ్యర్థనను విపక్షం చెవిన పెట్టలేదు. ఉదయం నుంచీ మధ్యాహ్నం 3 గంటల వరకు నాలుగు సార్లు వాయిదా పడిన సభ.. విపక్షాలు శాంతించకపోవడంతో మంగళవారానికి వాయిదా పడింది. ఈ వివాదం లోక్‌సభనూ కుదిపేసింది. ప్రధాని జవాబివ్వాలన్న కాంగ్రెస్, వామపక్షాలు, ఆర్జేడీ, జేడీయూ సభ్యుల నిరసనలు రెండు సార్లు సభ వాయిదాకు కారణమయ్యాయి. మీది గాంధీ పరివార్.. నాది సంఘ్ పరివార్ ఆరెస్సెస్ నేపథ్యం తనకు గర్వకారణమన్న వెంకయ్య ఇటీవలి వ్యాఖ్యలను ఖర్గే గుర్తు చేశారు. దాంతో.. ‘మీకు గాంధీ పరివార్(కుటుంబం) గర్వకారణం. నాకు సంఘ్‌పరివార్ గర్వకారణం’ అని వెంకయ్య వ్యంగ్యంగా బదులిచ్చారు. ‘వెంకయ్య కుర్చీలో స్ప్రింగ్‌లున్నాయేమో, మాటిమాటికీ లేచి నిల్చుని మాట్లాడుతున్నార’న్న ఖర్గే వ్యాఖ్యపై.. ‘మాది క్రియాశీల ప్రభుత్వం. విపక్ష వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేకున్నా జవాబిస్తున్నాం’ అని అన్నా రు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా విపక్షాలు వా కౌట్ చేశాయి. కాగా, ఈ వివాదానికి ముగింపు ఏ విధంగా పలకాలన్న దానిపై మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో బీజేపీ, సంఘ్ కీలక నేతలు సోమవారం సమావేశమై చర్చలు జరిపారు. -
మతమార్పిళ్లపై ఆగని రగడ
వరుసగా రెండోరోజూ రాజ్యసభ వాయిదా న్యూఢిల్లీ: మతమార్పిడుల వ్యవహారంపై ప్రధాని మోదీ సభకు సమాధానం చెప్పాలనే డిమాండ్, క్రిస్మస్ రోజున కూడా పాఠశాలల్లో కార్యక్రమాలు కొనసాగించాలనే ప్రభుత్వ యోచనకు నిర సనగా రాజ్యసభ మంగళవారం అట్టుడికింది. విపక్షాలన్నీ ఏకమయ్యాయి. బలవంతపు మతమార్పిడులకు అడ్డుకట్టవేసేలా ప్రధానిస్పష్టమైన ప్రకటన ఇచ్చేవరకు ఊరుకోమంటూ సభాకార్యకలాపాలను అడ్డుకున్నాయి. దీంతో వరుసగా రెండో రోజూ సభ వాయిదా పడింది. సభ సజావుగా సాగటం ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టం లేకనే ఇలా వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్, లెఫ్ట్, సమాజ్ వాదీ పార్టీల సభ్యులు పెద్దగా నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. క్రిస్మస్ నాడు నవోదయ విద్యాలయాల్లో సెలవు బదులు ‘గుడ్ గవర్నెన్స్’ అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించాలంటూ ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వులను సభ ముందుంచాలని సీతారాం ఏచూరి(సీపీఎం) డిమాండ్ చేశారు.ప్రతిపక్షం సభలో చర్చకు బదులు అరాచకం సృష్టిస్తోందని మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. సభ ఆరుసార్లు వాయిదాపడింది. బలవంతపు మత మార్పిడులపై ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ అంగీకరించబోమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంక య్యనాయుడు స్పష్టం చేశారు. హెలికాప్టర్లకు టెండర్లు పిలవలేదు.. అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత మరో సంస్థతో అలాంటి ఒప్పందం ఏదీ జరగలేదని రక్షణమంత్రి మనోహర్ పారికర్ రాజ్యసభకు తెలిపారు. పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ యథాతథం ఇటీవల పెట్రోలు, డీజిల్‌పై పెంచిన ఎక్సైజ్ డ్యూటీని తగ్గించే యోచనేదీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రి జయంత్ సిన్హా ఈ మేరకు రాజ్యసభలో లిఖిత పూర్వకంగా ప్రకటించారు. అంతర్జాతీయ మార్కెట్లో ఇటీవల పడిపోతున్న చమురు ధరలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈ మేరకు పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. -
‘మార్పిడి’కి విరుగుడు చట్టమే
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో ఆగ్రా ఘటన పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసిన పార్టీలు... ‘మత మార్పిడుల వ్యతిరేక చట్టం’ ప్రతిపాదన వద్దకు వచ్చేసరికి పాక్షికంగా మూగబోయాయి. అలాంటి చట్టం ఆగ్రా త రహా ఘటనలు భవిష్యత్తులో జరిగితే దాన్ని సూటిగా క్రిమినల్ నేరంగా గుర్తిస్తుంది. ప్రలోభాలతో జరిపే మత మార్పిడులు ఎవరు చేసినా... హిందూ, ఇస్లాం, క్రైస్తవ, బౌద్ధమతాలు ఏవి చేసేవైనా వాటికి అడ్డుకట్ట వేస్తుంది. మతం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంగా ఉండటమే ఆదర్శప్రాయం. వేల ఏళ్ల వివాదాస్పద చరిత్ర గలిగిన సామాజిక సమస్యకు చట్టం ఎల్లవేళలా అత్యుత్తమ పరిష్కార మార్గం కాదు. అయితే ప్రభుత్వాలు ఎల్లప్పుడూ ఘటనలను నియంత్రించలేవు. కొన్ని సందర్భాలలో, ఘటనలే ప్రభుత్వాలను నియంత్రిస్తాయి. ఆగ్రాలో పేదరికం, వలస రావడం సహా ఎన్నో రూపాలలోని ఒత్తిడుల కింద మనుగడ సాగిస్తున్న కొందరు ముస్లింలను ‘‘పునఃపరివర్తన’’ చెందించాలని కొందరు కరడుగట్టిన మతవాదులు భావించారు. ఈ ఘటన మత సంబంధాల విషయంపై అంతర్గతంగా పెల్లుబుకుతున్న అంతర్వాహినిని బయటకు తెచ్చింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ స్పందన సూటిగానూ, గందరగోళానికి తావులేనివిధంగా, సుస్పష్టంగా ఉంది. అది సమస్యను మూలం నుంచి చర్చించింది. బలవంతపు మత మార్పిడుల నిరోధక చట్టాన్ని చేయడానికి అన్ని పార్టీలూ సహకరించాలని కోరింది. ఇందులోని క్రియాత్మక పదం ‘బలవంతపు’. దీనితో న్యాయపరంగా గానీ లేదా నైతికపరంగాగానీ ఎలాంటి సమస్యా ఉండకూడదు. ఏ మత విశ్వాసమూ అందుకు అనుమతించదు. బలవంతపు మత మార్పిడి అర్థరహితం ఉదాహరణకు, ఖురాన్ ఈ విషయంలో చాలా విస్పష్టంగా ఉంది. సురా 2 వచనం 256 నిస్సంశయంగానూ, విస్పష్టంగానూ ఇలా చెప్పింది: ‘‘మతం లో ఎలాంటి నిర్బంధమూ ఉండనీయరాదు.’’ అబ్దుల్లా యూసఫ్ తన ప్రామాణిక అనువాదంలో ఆ అంశాన్ని ఇలా వివరించారు. ‘‘బలవంత పెట్టడానికి, మతానికి పొంతన కుదరదు. ఎందుకంటే మతం విశ్వాసంపై, అభీష్టంపై ఆధారపడినది. వాటిని బలవంతంగా ప్రేరేపించడం అర్థరహి తం...’’ గతంలో బలాన్ని ప్రయోగించి ఉంటే అది తప్పు. ఏది ఏమైనా ప్రజాస్వామిక సమాజంలో అందుకు తావులేదు. ఉదారవాద హిం దూ సిద్ధాంత, తత్వశాస్త్రాలలో సైతం బల ప్రయోగానికి సామంజస్యం లేదు. అలాంటి చట్టం తేవాలంటే పార్లమెంటే గాక, ఇతర సంస్థల మద్దతు కూడా కావాలని అనవచ్చు. విశ్వసనీయత గలిగిన మత నేతల వివేచనాయుతమైన అభిప్రాయాలను కోరడానికి వీలుగా ప్రభుత్వం ఈ చర్చ పరిధిని విస్తరించి, నిర్దిష్ట కాల వ్యవధిలో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అప్పుడు మనకు ఎవరు, ఎక్కడ నిలుస్తారనేది తెలుస్తుంది. అయితే అంతిమంగా ఆ బాధ్య త పార్లమెంటుది, అందులో ప్రాతినిధ్యం వహించే పార్టీలది. సభలో మూగబోయిన పార్టీలు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో ఆగ్రా ఘటన పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసిన పార్టీలు ఈ ప్రతిపాదన వద్దకు వచ్చేసరికి పాక్షికంగా మూగబోయాయి. మత మార్పిడి వ్యతిరేక చట్టం ఆగ్రా త రహా ఘటనలు భవిష్యత్తులో జరిగితే దాన్ని సూటిగా క్రిమినల్ నేరాన్ని చేస్తాయి. ప్రలో భాలతో జరిపే మత మార్పిడులు ఎవరు చేసినా... హిందూ, ఇస్లాం, క్రైస్తవ, బౌద్ధమతాలు ఏవి చేసేవైనా అడ్డుకట్ట వేస్తుంది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, వివిధ రకాల జనతాదళ్‌లు, మార్క్సిస్టుల లక్ష్యం ఇదేనని ఎవరైనా భావిస్తారు. వాస్తవానికి, మతం పట్ల మార్క్సిస్టుల సంశయాత్మకత వల్ల వారు ఈ అంశంపై ప్రభుత్వానికి మద్దతు పలుకుతారని ఆశిస్తాం. కానీ అందుకు బదులుగా వారు దాన్ని వెనక్కునెట్టే వైఖరిని నర్మగర్భంగా చేపట్టారు. ఎందుకు? పాలకపక్షం స్పష్టవైఖరి ప్రధాని నరేంద్ర మోదీ నుండి ప్రారంభించి ప్రధానంగా ప్రభుత్వం తరఫున మాట్లాడిన వారంతా... ఎన్నికైన ప్రభుత్వం విధి... మంచి పరిపాలనను అందించడమే తప్ప, ఏ రూపంలోని మతతత్వాన్నీ ప్రోత్సహించడం కాదని స్పష్టంగా చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం నాటి ఒక టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. వినిపిం చుకునే వారు ఎవరికైనాగానీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అదే చెబుతూ వచ్చారు. నేటి భారతావనికి కావలసిందీ, అది డిమాండు చేసేదీ దేశం సౌభాగ్యవంతం కావడానికి రహదారే తప్ప, ఉద్వేగవాద రాజకీయాలు, విరోధాలు కావు. శాంతి లేనిదే సౌభాగ్యం కలగదని, శాంతి మొదలు కావాల్సింది ఇంటి నుంచేనని పామర జ్ఞానం చెబుతుంది. పేదల సంక్షేమమే విధి ప్రతి ప్రభుత్వమూ వచ్చేటప్పుడు తన సొంత పనికిరాని సామాన్ల బరువును మోసుకుంటూనే వస్తుంది. అయితే ఆ బరువు దాని ప్రయాణా నికి ఆటంకంకారాదు. నేటి మన కేంద్ర ప్రభుత్వం ఎక్కడికి పోవాలను కుంటోంది? దాని దృష్టి పథం విస్తృతి ఎంత? 2019లో తిరిగి ప్రజాతీర్పు ను కోరే నాటికి అది ఎక్కడ ఉండాలని కోరుకుంటోంది? సమాధానం విషయంలో గందరగోళానికి తావేలేదు. ప్రధాని తన తొలి లోక్‌సభ ఉప న్యాసంలోనే, పేదల సంక్షేమం కోసం కాకపోతే ప్రభుత్వం అవసరమేమిటి? అని చెప్పనే చెప్పారు. గత సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ గెలిచింది ‘అందరికీ అభివృద్ధి’ అనే సామాన్యమైన సందేశంతోనే. ‘అందరికీ’, అందులోనే మైనారిటీలూ ఉన్నారు. భారత ముస్లింలు ఒక చేతిలో ఖురాన్, మరో చేతిలో కంప్యూటర్ పట్టుకోవాలని కోరుకుంటున్నానని ప్రధాని ఈ సందర్భంగా పదేపదే చెప్పారు. ఆ కేంద్ర సందేశంలోని ఏ భాగాన్నీ రవ్వంతైనా ఆయన మార్చిం ది లేదు. సందేశాన్ని పలచబారేట్టు లేదా గందరగోళపరచేట్టు చేసేవారు ప్రధాని మోదీకి ఏమీ మంచి చేయడం లేదు. మతం వ్యక్తిగతమైనదే కానీ... అసంబద్ధమైన ఈ గోలలో పడి ప్రభుత్వం ఈ పార్లమెంటు సమావేశాల్లో సంస్కరణలకు తిరిగి దిక్సూచిని నెలకొల్పగలిగిందనే విషయం మరుగున పడిపోయింది. సంశయవాదులకు సమాధానం చెప్పడానికి ఇన్సూరెన్స్ నిబంధనల్లో మార్పులు చాలు. జాతీయీకరణను తలకిందులు చేసే చర్య అంటూ వామపక్షం నుండి అలవాటు గా వినవచ్చే శబ్దాలెలా ఉన్నా బొగ్గు బిల్లు ఆమోదం పొందింది. ఇక జీఎస్టీకి సంబంధించి చిట్టచివరి ఆటంకం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుండి వచ్చింది. దీన్ని సైతం వర్షాకాల సమావేశాల నాటికి పరిష్కరించాల్సిందే. బెంగాల్ ముఖ్యమంత్రి ఆందోళన, దేశం గురించో లేదా దేశ ఆర్థిక వ్యవస్థ గురించో కాదు. శారదా కుంభకోణానికి, ఆమె మంత్రివర్గ సహచరుడు మదన్ మిత్రాకు ఉన్న సంబంధాన్ని సీబీఐ కనిపెట్టడమే అందుకు కారణం. కెవ్వున కేకపెట్టడమే అందుకు సమాధానమని ఆమె దురదృష్టవశాత్తూ అనుకుంటున్నారు. కానీ ఓటరు అంతకంటే తెలివైన వాడని గుర్తించాలి. మతం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంగా ఉండటమే ఆదర్శప్రాయం. అదే సమయంలో ప్రజాజీవితానికీ ఓ గ్రంథం ఉంది... అది రాజ్యాంగం. రాజకీయాల ఏకైక కర్తవ్యం ప్రజలకు ఎక్కువ మేలు చేయడమే. -
మత మార్పిడుల నిరోధక బిల్లుకు సిద్ధమా?
కాంగ్రెస్‌కు ఎం.వెంకయ్యనాయుడు సవాల్ పాకిస్తాన్ ఎంపీ అవైస్ ఖాన్ లెఘరీపై మండిపాటు బెంగళూరులో ఐఎస్ఐఎస్కు సహకరించే శక్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టీకరణ తిరుపతి: మత మార్పిడుల నిరోధక బిల్లుకు అంగీకరిస్తే.. పార్లమెం టులో తాము చర్చకు సిద్ధమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్ తండ్రి, కాంగ్రెస్‌కు మిత్రుడైన ములాయంసింగ్ యాదవ్ ఆగ్రాలో ఎలాంటి మత మార్పిడులు జరగలేదని కొట్టిపారేస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. తిరుపతిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మత మార్పిడుల నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తే చట్టం చేయవచ్చని రాజ్యాంగ రచన పూర్తయిన వెంటనే బీఆర్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్‌పటేల్ అప్పుడే చెప్పారన్నారు. మహాత్మాగాంధీ సైతం మత మార్పిడుల నిరోధక చట్టానికి అప్పట్లో సానుకూల ప్రకటనలు చేశారని గుర్తుచేశారు. ఆగ్రాలో మతమార్పిడులపై ఆందోళన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్.. మత మార్పిడుల నిరోధక చట్టంపై చర్చిద్దామని తాము ప్రతిపాదిస్తే యూటర్న్ తీసుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. భారత్-పాకిస్తాన్ సంబంధాలను మెరుగుపరిచేందుకు శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన ఇరు దేశాల పార్లమెంటేరియన్ల సదస్సులో పాకిస్తాన్ ఎంపీ అవైస్ఖాన్ లెఘరీ చేసిన వ్యాఖ్యలపై వెంకయ్యనాయుడు మండిపడ్డారు. ఉగ్రవాదులకు స్థావరాలను ఏర్పాటుచేసి.. నిధులు సమకూర్చి.. శిక్షణ ఇచ్చి భారతదేశంలో విధ్వంసానికి పురిగొల్పుతున్న పాకిస్థాన్ శాంతి ప్రవచనాలు వల్లెవేయడం వంద ఎలుకలను తిన్న పిల్లి హజ్ యాత్ర కు వెళ్లినట్టుందని ఎద్దేవా చేశారు. చరిత్ర పుటలను తిరగేస్తే భారతదేశం ఎన్నడూ దండయాత్ర చేసిన దాఖలాలు లేవని.. విదేశీయులే భారత్‌పై దండెత్తి వచ్చారని గుర్తు చేశారు. భారతదేశం ఎప్పుడూ ఇత ర దేశాలతో స్నేహాన్ని కోరుకుంటుందని.. కయ్యాన్ని కోరుకోదని స్పష్టీకరించారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల కార్యకలాపాలను ఆపివేస్తే.. చర్చలకు తాము సిద్ధమని స్పష్టీకరించారు. ఆ దేశ ప్రధాని నవాజ్‌షరీఫ్ మాటలకు చేతలకు పొంతన కుదరకపోవడం వల్లే సార్క్ సదస్సులో నరేంద్రమోదీ ఆయనతో అంటీఅంటనట్లు వ్యవహరించారని వివరించారు. ఇండో పాక్ పార్లమెంటేరియన్ల సదస్సులో కాంగ్రెస్ ఎంపీ మణిశంకర్ అయ్యర్ భారతదేశంపై, నరేంద్రమోదీపై చేసిన వ్యాఖ్యలకు ఆరోపణలకు కాంగ్రెస్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐఎస్ఐఎస్(ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా) ఉగ్రవాద కార్యకలాపాలకు బెంగళూరులోని ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా సహకరిస్తున్నారని బ్రిటన్‌కు చెందిన ఓ చానల్ బహిర్గతం చేయడాన్ని విలేకరులు వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకెళ్లగా.. ‘‘ఐఎస్ఐఎస్కు సహకరించే శక్తులను వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఈ అంశంపై అప్పుడే కేంద్ర నిఘా సంస్థలు రంగంలోకి దిగాయి. ఐఎస్ఐఎస్కు సహకరిస్తున్న శక్తులను గుర్తించి కఠినంగా శిక్షిస్తాం’’ అని స్పష్టీకరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే ప్రతిపాదన ఎంత వరకూ వచ్చిందన్న విలేకరుల ప్రశ్నకు వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. ‘‘దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల తో సంప్రదింపులు జరుపుతున్నాం.. అన్ని ప్రభుత్వా లు అంగీకారం తెలిపిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడంపై నిర్ణయం తీసుకుం టాం’’ అన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెంట ఆపార్టీ నేత భానుప్రకాష్‌రెడ్డి ఉన్నారు. -
ఆగ్రా మత మార్పిళ్లపై రగడ
ప్రధాని ప్రకటన చేయాలని పార్లమెంట్లో విపక్షాల పట్టు న్యూఢిల్లీ: ఆగ్రా శివారులోని ఓ మురికివాడలో దాదాపు 60 ముస్లిం కుటుంబాలను బలవంతంగా హిందూ మతంలోకి మార్చినట్లు వచ్చిన ఆరోపణలు బుధవారం పార్లమెంట్‌ను కుదిపేశాయి. రాజ్యసభలో విపక్షాలు ఈ అంశాన్ని ప్రస్తావించాయి. సభ ప్రారంభంకాగానే జీరో అవర్‌లో బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ.. దీన్ని దేశ లౌకికతపై దాడిగా అభివర్ణించారు. ‘ఆర్ఎస్ఎస్ సోదర సంస్థ బజరంగ్దళ్ కొందరు ముస్లింలను బలవంతంగా మతం మార్పించినట్లు పత్రికల ద్వారా తెలుస్తోంది. వారి పేదరికాన్ని అలుసుగా తీసుకుని ఈ పని చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించాలి. కఠిన చర్య తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. ఆమెను సమర్థిస్తూ ఇతర పక్షాలు కూడా ఈ అంశంపై ప్రభుత్వ వివరణకు పట్టుబట్టాయి. దీనికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందిస్తూ.. లౌకిక విధానాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రాజకీయ కారణాలతో ఏదో ఒక సంస్థ పేరు చెప్పడం సరికాదన్నారు. అయితే దీనిపై ప్రధా ప్రకటన చేయాలని కాంగ్రెస్, సీపీఎం డిమాండ్ చేశాయి. లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ ఈ అంశాన్ని లేవనెత్తింది. ఆగ్రాలో ఏం జరిగిందో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ అంశంపై చర్చ కోసం ఆ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. మతమార్పిడిపై విమర్శలను బీజేపీ తోసిపుచ్చింది. కేసు నమోదు.. ఆగ్రాలో గత సోమవారం ధర్మ జాగరణ్ మంచ్ అనే హిందూసంస్థ 60 ముస్లిం కుటుంబాలకు చెందిన వంద మందిని యాగాగాలు చేసి హిందూ మతంలోకి మార్చింది. దీనిపై బుధవారం పార్లమెంటులో ప్రతిపక్షాలు మండిపడిన నేపథ్యంలో... సదరు ఘటనపై ఆగ్రా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మతమార్పిడి చరేసిన జాగరణ్ మంచ్, దాని కన్వీనర్ కిశోర్‌పై ఎఫ్ఐఆర్ కేసు పెట్టారు. దేవ్‌నార్‌లోని మురికివాడలో ఉండే వంద మందికిపైగా ముస్లింలను తిరిగి హిందువులుగా మార్చినట్లు సదరు సంస్థపై ఆరోపణలు వచ్చాయి. రేషన్‌కార్డులు, ఇంటిస్థలం ఇప్పిస్తామని హామీలు ఇచ్చి మత మార్పిడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.