మానసిక సమ్యసల భారత్
భారత్‌లో అంతకంతటికీ పెరిగిపోతున్న మానసిక ఆరోగ్య సమస్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్ధ(డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళన వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ: భారత్‌లో అంతకంతటికీ పెరిగిపోతున్న మానసిక ఆరోగ్య సమస్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్ధ(డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. డబ్ల్యూహెచ్‌ఓ తాజాగా విడుదల చేసిన అంశాలు విస్మయం కలిగిస్తున్నాయి. 2015లో దాదాపు ఐదు కోట్ల మందికి పైగా భారతీయులు మానసిక ఒత్తిడితో కుంగిపోయారని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. మధ్య, దిగువ తరగతి దేశాల్లోనే ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పింది. 2005 నుంచి 2015ల మధ్య మానసికంగా క్షోభకు గురవుతున్న జనాభా శాతం 18.4కు పెరిగింది.
ఒక్క 2015లో ఇండియాలో ఏడు లక్షల ఎనభైఎనిమిది వేల మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ఇంతకంటే పెద్ద సంఖ్యలో ఆత్మహత్యకు పాల్పడ్డారని.. అదృష్టవశాత్తు వారందరూ ప్రాణాలు నిలబెట్టుకోగలిగారని చెప్పింది. 15-29 మధ్య వయసు కలిగిన వారు మరణించాడానికి గల కారణాల్లో ఆత్మహత్య రెండో స్ధానంలో ఉంది. 2012లో ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో భారత్ మొదటి స్ధానంలో ఉంది.