మోడీని ప్రశంసలతో ముంచెత్తిన అనుపమ్ ఖేర్!
న్యూఢిల్లీ: లోకసభ లో బీజేపీ నాయకుడు నరేంద్రమోడీపై బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రశంసలతో ముంచెత్తారు. మోడీ గొప్ప దేశభక్తుడు, గొప్ప నాయకుడు అని అనుపమ్ ఖేర్ కితాబిచ్చారు. గుజరాత్ భవన్ లో మోడిని కలుసుకున్నట్టు ఖేర్ ట్విటర్ లో ఫోటోను, వివరాలను పోస్ట్ చేశారు.
కాబోయే ప్రధాని నరేంద్రమోడీని కలుసుకోవడం గొప్ప అనుభూతినిచ్చింది. మోడీ దేశభక్తి, పోరాట పటిమ జైహో అంటూ ట్వీట్ చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంఢీఘడ్ లోకసభ స్థానం నుంచి అనుపమ్ ఖేర్ సతీమణి కిరణ్ ఖేర్ బీజేపీ తరపున ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.