చెన్నై: దేశంలోనే తొలిసారిగా ఓ రోగికి చెన్నై గ్లోబల్ హెల్త్ సిటీఆస్పత్రి వైద్యులు కృత్రిమ ఊపిరితిత్తుల పరికరాన్ని విజయవంతంగా అమర్చి తాత్కాలికంగా ఊపిరి పోశారు. బహ్ర రుున్‌కు చెందిన ఫాతిమా అహ్మద్(64)కు లింఫ్ యాంజియోలియో మయోమటోసిస్ వ్యాధి వల్ల ఊపిరితిత్తుల మార్పిడి అనివార్యమైంది. అవయవ దాత అందుబాటులో లేకపోవడంతో ఊపిరితిత్తుల్లా పనిచేసే కృత్రిమ అవయవాన్ని అమర్చారు.
బైపాస్ ద్వారా ఛాతిపై దీనిని అమర్చడానికి బదులుగా, ఎడమ కాలి తొడ భాగం నుంచి గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ప్రధాన నాళానికి ఇంప్లాంట్‌లోని ఓ సన్నని పైపును, మరో తొడ భాగంలోని ప్రధాన నాళానికి ఇంకో పైపును అమర్చారు. ఊపిరితిత్తులు చేసే పనుల్ని చేసేలా ఇంప్లాంట్‌ను సిద్ధం చేశారు. దీనిని గరిష్టంగా ఆరు నెలలే ఉపయోగించాలని, ఆలోపు ఊపిరితిత్తుల మార్పిడి చేయాలని వైద్యులు తెలిపారు.
కృత్రిమ ‘ఊపిరితిత్తుల పరికరం’తో ఊపిరి!
Published Fri, Nov 28 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 5:14 PM
Advertisement