Bypass
-
బైపాస్ చార్జింగ్: కొత్త ఫీచర్‌తో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్
భారత్‌లో ఇన్ఫినిక్స్ నోట్ 30 5జీ ( Infinix Note 30 5G) తాజాగా విడుదలైంది. 6.78 అంగుళాల 120హెడ్జ్ డిస్ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 6080 SoC, 8GB వరకు ర్యామ్‌తో కూడిన ఫీచర్-ప్యాక్డ్ స్మార్ట్‌ఫోన్ ఇది. హై రిజల్యూషన్ 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, JBL సౌండ్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో వస్తోంది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5,000mAh బ్యాటరీ, గేమింగ్ సమయంలో వేడెక్కడాన్ని తగ్గించడానికి బైపాస్ చార్జింగ్ మోడ్‌ను కలిగి ఉంది. ఇన్ఫినిక్స్ నోట్ 30 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. ఇక 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999. యాక్సిస్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్లు రూ. 1,000 తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్ అమ్మకాలు జూన్ 22వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానున్నాయి. స్పెసిఫికేషన్లు ఇన్ఫినిక్స్ నోట్ 30 5జీ ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13-ఆధారిత XOS 13 ఆపరేటింగ్ సిస్టమ్ 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 580 నిట్ల వరకు గరిష్ట బ్రయిట్నెస్తో పెద్ద 6.78అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ డిస్ప్లే ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 SoC, మాలి G57 MC2 GPU, 8GB వరకు ర్యామ్ హై-రిజల్యూషన్ 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, రెండు అదనపు సెన్సార్లు ముందు భాగంలో, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16-మెగాపిక్సెల్ కెమెరా. JBL సౌండ్‌ని అందించే డ్యూయల్ స్టీరియో స్పీకర్లు. హై-రెస్ ఆడియో సర్టిఫికేషన్ 256 జీబీ వరకు స్టోరోజ్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ఉపయోగించి విస్తరించవచ్చు. 5G, 4G, Wi-Fi, బ్లూటూత్, GPS, NFC, 3.5mm ఆడియో జాక్, USB టైప్-C పోర్ట్‌తో సహా వివిధ కనెక్టివిటీ ఆప్షన్లకు మద్దతు యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటి అనేక సెన్సార్లు. బయోమెట్రిక్ ప్రమాణీకరణ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీ. గేమర్లు నేరుగా మదర్‌బోర్డుకు చార్జ్ చేసే బైపాస్ ఛార్జింగ్ ఫీచర్. 168.51x76.51x8.45mm కొలతలు, 204.7 గ్రాముల బరువు. Time to live life in the fast lane with Note 30 5G, thanks to India's first MediaTek Dimensity 6080 Processor, a smooth 120Hz Display, up to 16GB* RAM, and 256 Storage! Sale starts 22nd June, 12PM, only on Flipkart. Click here to know more: https://t.co/6DNmOKpB2z#ChangeTheGame pic.twitter.com/HVXgXOlDtB — Infinix India (@InfinixIndia) June 14, 2023 -
౩౦ ఏళ్ల కల నెరవేరింది
-
బైపాస్ రోడ్డు పనులు పూర్తి
– ఇప్పటికే అనధికారంగా వాహనాల రాకపోకలు – తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు – ఇక భారీ వాహనాలన్నీ బైపాస్‌లో వెళ్లాల్సిందే! కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు) : కర్నూలు నగర శివారులో రెండు జాతీయ రహదారులను కలుపుతూ నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దాదాపు ఏడేళ్లపాటు కొనసాగిన పనులు ఏడాది నుంచి వేగం పుంజుకొని ఈ మధ్యనే పూర్తికావడంతో అనధికారంగా వాహనాలు పరుగులుతీస్తున్నాయి. బైపాస్ పూర్తవడంతో నగరంలో ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గే అవకాశముందని పోలీసులు, రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఏడేళ్లపాటు కొనసాగిన నిర్మాణ పనులు కర్నూలులో ట్రాఫిక్ నియంత్రణ కోసం నగర శివారులో జాతీయ రహదారులు 18, 44 కలుపుతూ బైపాస్ రోడ్డు నిర్మాణానికి 2010 నవంబర్‌లో పునాది పడింది. జాతీయరహదారి 18లోని సఫా ఇంజినీరింగ్ కళాశాల నుంచి జాతీయ రహదారి 44లో కేశవరెడ్డి స్కూల్ సమీపం వరకు రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. మొత్తం 50.53 కోట్లతో పనులను కేఎంసీ కన్స్ట్రక్షన్ సంస్థ దక్కించుకుంది. పనుల పూర్తికి రెండేళ్ల గడువును విధించారు. రహదారి నిర్మాణానికి భూమిని సేకరించడంలో స్థానిక రెవెన్యూ అధికారులు విఫలమయ్యారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం తోడవడంతో రెండేళ్లలో పూర్తికావల్సిన పనులు ఏడేళ్ల పాటు కొనసాగాయి. నగరంలోకి భారీ వాహనాలకు నో ఎంట్రీ! బైపాస్ రోడ్డు పూర్తవడంతో త్వరలో నగరంలోకి భారీ వాహనాలను అనుమతించరు. ప్రస్తుతం హైదారబాద్, బెంగుళూరు నుంచి వచ్చే వాహనాలు కడప, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, శ్రీశైలం వెళ్లాలంటే సీక్యాంపు మీదుగా వెళ్లాల్సి ఉంది. దీంతో నగరంలో భారీ వాహనాలతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ రహదారి పూర్తికావడంతో కొంతమేర ట్రాఫిక్ కష్టాలు తగ్గే అవకాశముంది. శంషాబాద్ రింగ్ రోడ్డును తలపిస్తున్న నిర్మాణం... బైపాస్ రోడ్డు హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ రింగు రోడ్డు నిర్మాణాన్ని తలిపిస్తోంది. ఎక్కడి వాహనాలక్కడే వెళ్లేందుకు వీలుగా రహదారి మొత్తం నాలుగు రహదారులుగా విడిపోయింది. నంద్యాల–కర్నూలు, బెంగుళూరు–నంద్యాల, హైదరాబాద్, కర్నూలు–నంద్యాల, నంద్యాల–బెంగుళూరుగా విడిపోయింది. త్వరలోనే ప్రజాప్రతినిధులతో ప్రారంభింపజేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
కిడ్నీ రక్తనాళాలకు బైపాస్
దేశంలోనే తొలిసారిగా నిర్వహించిన ఉస్మానియా వైద్యులు సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు మరో ఘనత సాధించారు. హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న ఓ యువకుడికి దేశంలోనే తొలిసారి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. నల్లగొండ జిల్లా మాచవరానికి చెందిన హరికృష్ణ (19) హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నాడు. మందులు వాడినా బీపీ కంట్రోల్ కాలేదు. ఒక్కోసారి 300/120 ఎంఎం నమోదు అయ్యేది. వైద్య పరిభాషలో దీన్ని ‘తక్యాసూస్ ఆర్టిటీస్’గా పిలుస్తారు. శ్వాస సరిగా తీసుకోలేకపోవడం వల్ల గుండె స్పందనపై ఒత్తిడి పెరిగి తీవ్ర ఇబ్బంది పడేవాడు. చికిత్స కోసం అనేక మంది కార్డియాలజిస్టులను సంప్రదించాడు. ఫలితం లేకపోవడంతో ఏడాది క్రితం ఉస్మానియా నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ మనిషా సహాయ్ని కలిశాడు. కిడ్నీ రక్త నాళాల్లో రెనిన్ అనే పదార్థం ఉత్పత్తి కావడమే హైపర్ టెన్షన్‌కు కారణమని మనిషా నిర్ధారించారు. కిడ్నీలకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాలకు బైపాస్ చేయడం ఒక్కటే దీనికి పరిష్కారమని భావించారు. ఆ మేరకు ఏడాది క్రితం ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలోని వైద్య బృందం అతని ఎడమ కిడ్నీకి స్ప్లేనో రెనల్ ఆర్టేరియల్ అండ్ ఇన్ఫీరియర్ మెసెంటెరిక్-రెనల్ ఆర్టేరి బైపాస్ చేశారు. మూడు రోజుల క్రితం అతడి కుడి భాగంలోని కిడ్నీకి కూడా చికిత్స చేశారు. పెద్ద పేగులోని మూడు రక్తనాళాల్లో ఒకటి తొలగించి మూత్రపిండాలకు అమర్చారు. ప్రస్తుతం బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లోకి వచ్చిందని డాక్టర్ మధుసూదన్ చెప్పారు. ఈ తరహా చికిత్స చేయడం ప్రపంచంలోనే ఇది రెండోసారని పేర్కొన్నారు. ‘ఇండియన్ జర్నల్ ఫర్ నెఫ్రాలజీ’లో దీన్ని ప్రచురించామని, త్వరలోనే ఇంటర్నేషనల్ జర్నల్‌కు పంపుతున్నట్లు ఆయన తెలిపారు. -
పదేళ్ళ బాలుడికి భారత్ లో మొదటిసారి బైపాస్ సర్జరీ
న్యూ ఢిల్లీః అతి చిన్న వయసులో ఓ బాలుడికి బైపాస్ సర్జరీ చేశారు. కేవలం పదేళ్ళ వయసున్న బాలుడికి బైపాస్ చికిత్స నిర్వహించడం ఇండియాలో ఇదే ప్రధమం. న్యూ ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో విజయవంతా శస్త్ర చికిత్స నిర్వహించినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్ (ఎఫ్ ఈ హెచ్ ఐ) డైరెక్టర్ డాక్టర్ రామ్ జీ మహ్రోత్రా పర్యవేక్షణలో ఈ కార్డియో థొరాకిక్ వాస్క్యులర్ సర్జరీ నిర్వహించారు. ఆర్టేరియల్ గ్రాఫ్ట్ ను ఉపయోగించి మహ్రోత్రా కొరొనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ నిర్వహించారు. మధుర నివాసి అయిన పదేళ్ళ బాలుడు జన్యుపరమైన లోపంతో పుట్టాడు. హోమోజిగస్ ఫ్యామిలియల్ హైపర్ కొలెస్ట్రోలేమియా గా పిలిచే అరుదైన వ్యాధిగా దీన్ని గుర్తించవచ్చని ఆస్పత్రి వర్గాలు చెప్తున్నాయి. మూడు రోజుల పాటు ఛాతీ నొప్పితోపాటు, శ్వాస పరమైన ఇబ్బందికి బాలుడు గురయ్యాడని డైరెక్టర్ డాక్టర్ పీయూష్ జైన్ తెలిపారు. ఆస్పత్రికి వచ్చేప్పటికే అతడు ఓసారి గుండెపోటుతో బాధపడ్డాడని, ఇక ముందు గుండె ఆగిపోయేంతటి పరిస్థితి ఉందని తెలుసుకున్న వైద్యులు... రోగి పరిస్థితిని గమనించిన వెంటనే మరిన్ని పరిశోధనలతోపాటు, చికిత్స అందించేందుకు ఐసీయూకి తరలించినట్లు తెలిపారు. యాంజియో గ్రఫీ పరీక్ష నిర్వహించిన అనంతరం కరోనరీ ఆర్టరీ బ్లాకేజెస్ ఉన్నాయని గుర్తించి అందుకు అవసరమైన కరోనరీ ఆర్టెరీ బైపాస్ గ్రాఫ్టింగ్ ను వెంటనే నిర్వహించామని, అతడి గుండె కేవలం 50 శాతం సామర్థ్యం తోనే పనిచేస్తోందని తెలుసుకున్నామన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బైపాస్ సర్జరీ చేయాల్సి వచ్చిందని ఇంత చిన్న వయసులో బైపాస్ ఆపరేషన్ నిర్వహించడం వైద్యులకు ఓ సవాలేనని డాక్టర్ రాంజీ మెహ్రోత్రా అన్నారు. అంతేకాక అతడి గుండె కేవలం 22శాతం మాత్రమే కొట్టుకుంటుండటంతో ఆపరేషన్ తప్పనిసరి అయిందన్నారు. ఇప్పటివరకూ పెద్దల గుండెకు శస్త్ర చికిత్స చేసే పరికరాలు అందుబాటులో ఉన్నాయి తప్పించి... ఇటువంటి చిన్న వయసువారికి హార్ట్ సర్జరీ నిర్వహించేందుకు యంత్రాలు కూడ అందుబాటులో లేవన్నారు. చాలా కాలంగా ధమనులు పనిచేయడం లేదన్న విషయాన్ని మరో పరిశీలనలో తెలుసుకున్నామని ఇన్ని సవాళ్ళను ఎదుర్కొంటూ నిర్వహించిన ఆపరేషన్ విజయవంతం కావడంతో రోగి కేవలం వారం రోజుల్లోనే ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అయ్యాడని తెలిపారు. వంశపారంపర్యంగా వచ్చే జబ్బుల్లో ఒకటైన హైపర్ కొలెస్ట్రోలేమియా జన్యుపరమైన లోపమని, ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి రోగి పరిస్థితిని ప్రమాదకరంగా మారుస్తుందని ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ అశోక్ సేథ్ తెలిపారు. -
కృత్రిమ ‘ఊపిరితిత్తుల పరికరం’తో ఊపిరి!
చెన్నై: దేశంలోనే తొలిసారిగా ఓ రోగికి చెన్నై గ్లోబల్ హెల్త్ సిటీఆస్పత్రి వైద్యులు కృత్రిమ ఊపిరితిత్తుల పరికరాన్ని విజయవంతంగా అమర్చి తాత్కాలికంగా ఊపిరి పోశారు. బహ్ర రుున్కు చెందిన ఫాతిమా అహ్మద్(64)కు లింఫ్ యాంజియోలియో మయోమటోసిస్ వ్యాధి వల్ల ఊపిరితిత్తుల మార్పిడి అనివార్యమైంది. అవయవ దాత అందుబాటులో లేకపోవడంతో ఊపిరితిత్తుల్లా పనిచేసే కృత్రిమ అవయవాన్ని అమర్చారు. బైపాస్ ద్వారా ఛాతిపై దీనిని అమర్చడానికి బదులుగా, ఎడమ కాలి తొడ భాగం నుంచి గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ప్రధాన నాళానికి ఇంప్లాంట్‌లోని ఓ సన్నని పైపును, మరో తొడ భాగంలోని ప్రధాన నాళానికి ఇంకో పైపును అమర్చారు. ఊపిరితిత్తులు చేసే పనుల్ని చేసేలా ఇంప్లాంట్‌ను సిద్ధం చేశారు. దీనిని గరిష్టంగా ఆరు నెలలే ఉపయోగించాలని, ఆలోపు ఊపిరితిత్తుల మార్పిడి చేయాలని వైద్యులు తెలిపారు. -
దారి దశ తిరిగింది..
- రూ.3 వేల కోట్లతో 216 నేషనల్ హైవే అభివృద్ధి - కత్తిపూడి-తిమ్మాపురం మధ్య నాలుగులేన్లుగా విస్తరణ - కాకినాడ సహా జిల్లాలో ఏడు చోట్ల బైపాస్‌లు - భూసేకరణపై సమీక్షించిన అధికారులు సాక్షి, కాకినాడ : జిల్లాలోని కత్తిపూడి నుంచి ఒంగోలు వరకూ ఉన్న ఉన్న 216 జాతీయ రహదారికి రూపురేఖలు మారిపోనున్నాయి. అయిదు జిల్లాలను అనుసంధానిస్తూ దాదాపు 370 కిలోమీటర్ల నిడివి గల ఈ రహదారి విస్తరణ, అభివృద్ధుల నిమిత్తం కేంద్రం రూ.3 వేల కోట్లు మంజూరు చేసింది. కిలోమీటర్‌కు రూ.7.50 కోట్ల చొప్పున రూ.2,800 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. దీంతో కోస్తాంధ్రలో రవాణా వ్యవస్థ మరింత మెరుగు పడనుంది. తొలిదశలో జిల్లాలోని కత్తిపూడి నుంచి చించినాడ వరకు రహదారి విస్తరణకు అవసరమైన భూసేకరణ పనులకు నేషనల్ హైవేస్ అధికారులు శ్రీకారం చుట్టారు. జిల్లాలో కత్తిపూడి నుంచి దిండి వరకు 125 కిలోమీటర్ల మేర ఈ రహదారిని విస్తరించనున్నారు. కత్తిపూడి నుంచి కాకినాడ సమీపంలోని తిమ్మాపురంవరకు ఉన్న ప్రస్తుతం రెండు లేన్లను నాలుగులేన్లుగా విస్తరించనున్నారు. తిమ్మాపురం నుంచి మాధవపట్నం-ఇంద్రపాలెం-మేడలైను-తూరంగిల మీదుగా కాకినాడ-యానాం రహదారిలోని ఉప్పలంక వరకు కాకినాడ బైపాస్ రహదారిని నిర్మించనున్నారు. అక్కడ నుంచి చించినాడ వరకు ప్రస్తుతం ఉన్న ఏడు మీటర్ల రహదారిని పదిమీటర్ల రహదారిగా విస్తరించనున్నారు. కాకినాడ బైపాస్ మాదిరే.. కత్తిపూడి, చేబ్రోలు, గొల్లప్రోలు, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలులలో బైపాస్‌ల నిర్మాణం చేపట్టనున్నారు. చించినాడ నుంచి పామర్రు మీదుగా ఒంగోలు వరకు రహదారిని పదిమీటర్ల మేర విస్తరించనున్నారు. కత్తిపూడి నుంచి చించినాడ వరకు రహదారి విస్తరణ కోసం 970 ఎకరాల భూమి అవసరమవుతుందని గుర్తించారు. తిమ్మాపురం నుంచి మేడలైన్ మీదుగా ఉప్పలంక వరకు 17 కిలోమీటర్ల మేర కాకినాడ బైపాస్ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. కత్తిపూడి నుంచి తిమ్మాపురం వరకు ప్రతిపాదించిన నాలుగులేన్ల రహదారి విస్తరణలో భాగంగా చిత్రాడ వద్ద మరో రైల్వే ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. కాకినాడ బైపాస్ రహదారిలో కూడా మాధవపట్నం వద్ద రైల్వే ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. కాకినాడ నుంచి కోనసీమ మీదుగా చించినాడ వరకు వశిష్ట, వైనతేయ, ఆత్రేయగోదావరిలపై పలుచోట్ల వంతెనలూ నిర్మించనున్నారు. గ్రామాలవారీ జాబితాలు రూపొందించండి : జేసీ తొలిదశలో కత్తిపూడి నుంచి చించినాడ వరకు రహదారి విస్తరణకు అవసరమైన భూసేకరణపై శుక్రవారం సంబంధిత శాఖాధికారులు తొలిసారి కాకినాడలో భేటీ అయ్యారు. జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ మార్కండేయులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నేషనల్ హైవేస్ ఉన్నతాధికారులతో పాటు ఆర్ అండ్ బి, రెవెన్యూ, ల్యాండ్ అండ్ సర్వే శాఖాధికారులు ప్రాజెక్టు కోసం చేపట్టాల్సిన చర్యలను సమీక్షించారు. రైతులతో మాట్లాడి భూసేకరణకు సర్వే చేయాలని నిర్ణయించారు. గ్రామాల వారీగా ల్యాండ్ రిక్విజిషన్ జాబితాలు తయారుచేసి తదనుగుణంగా మార్కింగ్ చేయాలని ఏజేసీ ఆదేశించారు. ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి సేకరించాలో జాబితాలు తయారుచేయాలని సూచించారు. ఇందుకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ తహశీల్దార్లు, ఆర్ఐలు, సర్వేయర్లు, డ్రాఫ్ట్స్‌మెన్ ఎంతమంది అవసరమవుతారో ప్రతిపాదనలు సమర్పించాలని హైవేస్ అధికారులను జేసీ ఆదేశించారు. నిధులు సిద్ధంగా ఉన్నాయని, భూసేకరణ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తే టెండర్లు పిలుస్తామని వారు చెప్పారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బి, నేషనల్ హైవే సర్కిల్ విజయవాడ ఎస్ఈ పీడీ విజయ్‌కుమార్, కాకినాడ ఈఈ టి.సత్యనారాయణ, ఈఈ జి.హరికృష్ణ, ఫీడ్ బ్యాక్ ఇన్ఫ్రా సీహెచ్ మురళీకృష్ణ, డీఈ జీడీ ప్రభాకరరావు, ఏఈ ఎన్.శ్రీనివాసరావు, రెవెన్యూ, ల్యాండ్ అండ్ సర్వే అధికారులు పాల్గొన్నారు. -
బైపాస్...టైం పాస్
వనపర్తిలో బైపాస్ రహదారి నిర్మాణానికి అధికార యంత్రాంగం చేస్తున్న కసరత్తు అడుగు ముందుకు..రెండడుగులు వెనక్కు చందలా మారుతోంది. భూమి కొనుగోలుకు అప్పట్లో రూ. 50లక్షలు కేటాయించి పదెకరాలు సేకరించాలనుకున్నారు. రూ.1.50 లక్షలు వెచ్చించి సర్వే చేయడంతో పట్టణవాసుల్లో కొత్త ఆశలు రేకెత్తాయి. ఇంతలో భూమిరేట్లకు రెక్కలు మొలవడంతో అధికారులకు సేకరణ అంశం క్లిష్టంగా మారింది. నేతలూ దీనిపై పెదవి విప్పకపోవడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఫలితంగా ఏడేళ్లుగా ఆ దిశగా ఒక్క అడుగూ పడలేదు. ఇప్పుడు సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ అంశం మళ్లీ తెరమీదకొచ్చింది. నేతల నోటికి తాళం ఎందుకు...? రోజూ రోజుకు పెరిగిపోతున్న టాఫిక్ సమస్య నియంత్రిచేందుకు గతంలో వనపర్తిలో రింగ్ రోడ్డు ఏర్పాటును ప్రతిపాదించారు. గతంలోనే ఇక్కడ బైపాస్ రహదారి నిర్మించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు మంజూరైన నిధులు సహితం రెండున్నరేళ్లపాటు నాన్చినాన్చి తిరిగి పంపించేశారు. ప్రగల్భాలు పలికిన మన నేతలు సైతం నోటికి తాళం వేసుకొని ఉండటంతో బైపాస్ రహదారి లక్ష్యం నీరుగారుతూ టైంపాస్‌గా మారింది. అటు రోడ్ల విస్తరణ జరగాక, ఇటు బైపాస్ రహదారి అమలుకు నోచుకోకపోవడంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. అప్పటి గ్రామీణాభివద్థి శాఖ మంత్రి చిన్నారెడ్డి సూచన మేరకు 2008 మేలో ఇక్కడి అధికారులు బైపాస్ రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించి అప్పటి రోడ్డు భవనల శాఖ మంత్రి జీవన్‌రెడ్డికి, ఆ శాఖ ఇంజనీర్‌కు ప్రతిపాదనలు పంపించారు. రూ. 37 కోట్లు అవసరం ఆవుతాయని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. పట్టణ శివారు ప్రాంతంతోని చిట్యాల రోడ్డు, గోపాల్పేట్, పానగల్, పెబ్బేర్ రహదారులను కలుపుతూ ప్రతిపాదనలు రూపొందించారు. సుమారు 8 కిలో మీటర్ల పోడవున దీనిని అమలు చేయాలన్నుకున్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకరావడంలో అప్పటి మంత్రి విఫలమైయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రావుల చంద్రశేఖర్‌రెడ్డి సహితం ఈ ఊసే ఎత్తకపోవడంతో రింగ్ రోడ్డు ఏర్పాటు కలగానే మిగిలిపోయింది. గతంలో బైపాస్ రహదారి నిర్మాణం చేయడానికి హాడవిడి చేసిన నేతలు ఇప్పుడు బైపాస్ గురించి మాట్లాడటంగానీ, అలాంటి ప్రయత్నాలు నేతలెవ్వరూ చేయడం లేదనేది బహిరంగా రహస్యమే. స్థల సేకరణ జగని కారణంగా బైపాస్ రహదారికి మంజూరైన రూ.80 లక్షలు రెండేళ్ల పాటు మురిగి వెనక్కి వెళ్ళిపోయాయంటే మన నేతల అలసత్వం ఏ పాటిదో అర్ధం అవుతుంది. 2005లో అప్పటి సీఎం దివగంత వైఎస్సార్ నగరబాటలో భాగంగా వనపర్తి పట్టణంలో రహదారుల అభివద్థి ఏర్పాటుకు రూ. 2.5కోట్ల నిధులు కూడా మంజూరు చేశారు. పెబ్బేర్, కొత్తకోట, రహదారుల విస్తరణ రూ. 1.70 కోట్లతో పనులు చేపట్టారు. మిగిలిన రూ. 80 లక్షలతో బైపాస్ రహదారిని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించనున్నారు. నిర్మాణం ఇలా చేయాలన్నుకున్నారు... వనపర్తిలోని చిట్యాల చింతల హనుమాన్ దేవాలయం రాజనగరం, నాగవరం, క్రాస్ రోడ్డు వరకు సుమారు 1.6 కిలో మీటర్ల పోడవు 20-30 ఫీట్ల వెడల్పుగా బైపాస్ రహదారిని ఏర్పాటు చేయాలని భావించారు.