ప్రజాస్వామ్య శక్తిగా భారత్! | Australia PM Tony Abbott Arrives in India, Nuclear Deal Likely on Agenda | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్య శక్తిగా భారత్!

Published Fri, Sep 5 2014 2:20 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

Australia PM Tony Abbott Arrives in India, Nuclear Deal Likely on Agenda

ఆస్ట్రేలియా ప్రధాని అబాట్

ముంబై: భారత్ ‘ప్రజాస్వామ్య మహాశక్తి’గా రూపొందుతోందంటూ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబాట్ ప్రశంసించారు. కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధిలో దూసుకుపోతూ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోందన్నారు. భారత్‌లో వ్యాపారాభివృద్ధికి అద్భుతమైన అవకాశాలున్నాయన్నారు. భారత్‌లో 2 రోజుల పర్యటనకు వచ్చిన టోనీ అబాట్ గురువారం ముంబైలో తనతో పాటు భారత్ వచ్చిన వ్యాపార, పారిశ్రామిక వేత్తలనుద్దేశించి ప్రసంగించారు. మోడీ చెబుతున్న ‘మేక్ ఇన్ ఇండియా’ తరహా పిలుపును ఆస్ట్రేలియా వాణిజ్యాభివృద్ధి కోసం తానూ ఇచ్చానన్నారు.
 
ఆసియా-పసిఫిక్ ప్రాంత దేశాల మధ్య ఆర్థిక, సామాజిక సంబంధాలకోసం ఉద్దేశించిన ‘న్యూ కొలంబో ప్లాన్’ను ముంబై యూనివర్సిటీలో ప్రారంభించారు. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం కొలువుతీరిన తరువాత సార్కేతర దేశాల నుంచి ఒక ప్రభుత్వాధినేత భారత్ పర్యటనకు రావడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య పౌర అణు ఒప్పందం కుదరనుంది. దీని ద్వారా భారత్‌కు యురేనియం ను అమ్మేం దుకు ఆస్ట్రేలియాకు వీలవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement