
సాక్షి, న్యూఢిల్లీ : నోట్ల రద్దు వంటి భారీ తప్పిదాలకు భవిష్యత్‌లో పూనుకోవద్దని ప్రధాని నరేంద్ర మోదీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హితవు పలికారు. నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థకు విధ్వంసకర నిర్ణయమని గతంలో విరుచుకుపడ్డ మన్మోహన్ మరోసారి దీనిపై నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో అథ్యాపకులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
నోట్ల రద్దు వంటి తప్పుడు నిర్ణయాన్ని మరోసారి తీసుకోరాదని మోదీకి సూచించారు. నోట్ల రద్దు సమయంలో రూ కోట్లాది నల్లధనం తెలుపుగా మారిందని మోదీ సర్కార్‌పై మండిపడ్డారు. ప్రధాని నిర్ణయంతో లక్షలాది ఉద్యోగాలు కోల్పోయామని, కొత్త ఉద్యోగాలు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తన ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఇబ్బందులు కలిగించలేదని గుర్తుచేశారు. మోదీ ప్రభుత్వం అనాలోచిత విధానాలతో సామాన్య ప్రజలకు అసౌకర్యం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment