తిరువనంతపురం : కేరళలో ఓ బేకరీ యజమానికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతని షాపులో పనిచేసిన వారితోపాటు, ఆ దుకాణంలో కొనుగోళ్లు జరిపిన వారి వివరాలను ఆరా తీశారు. ఇడుక్కి జిల్లాలోని రెండు పంచాయతీ గ్రామాలను కంటెన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇడుక్కిలోని వందెన్మేడు పంచాయతీలో బేకరీ షాపు నిర్వాహకుడికి మే 14న కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వెంటనే అతడిని తోడుపుఝ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఆయన కుటుంబాన్ని క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించారు. అయితే అతడిలో వ్యాధి లక్షణాలు ఏమాత్రం కనిపించకపోవడం గమనార్హం. (అహ్మదాబాద్‌లో 700 మంది సూపర్ స్ప్రెడర్స్)
మరోవైపు గత వారం రోజులుగా వందలాది జనాలు సదరు బేకరీ షాపుకు వచ్చారు. వీరిలో సాధారణ ప్రజలతోపాటు జర్నలిస్టులు, పోలీసులు కూడా ఉన్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు శనివారం నాడు అతనితో సన్నిహితంగా మెలిగిన 300 మంది వ్యక్తుల జాబితాను తయారు చేశారు. బేకరీలో ఐదు నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉన్నవారు కూడా ఈ లిస్టులో ఉన్నారు. వీరందరికీ కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ పరీక్షల నిమిత్తం నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. (‘ఆడుకోవట్లేదు.. అమ్మాయిలని అరెస్ట్ చేయండి’)
Comments
Please login to add a commentAdd a comment