జైపూర్:అత్యాచార ఆరోపణలతో తన మంత్రి పదవికి రాజీనామా చేసిన జైపూర్ మంత్రి బాబూల్ నగర్ పై బీజేపీ విమర్శలు వర్షం గుప్పించింది. 53 సంవత్సరాల బాబూల్ తన సొంత నివాసంలోనే 35 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడట్లు ఆరోపణలు రావడంతో ఆయన తన పదవికి గురువారం రాజీనామా చేశారు. కాగా, బీజేపీ మాత్రం మంత్రిపై, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిపై విరుచుకుపడింది. ఇదొక రేపిస్టు ప్రభుత్వమని, అమాయకులపై అత్యాచారాలకు పాల్పడుతున్న వీరికి పాలించే నైతిక హక్కు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు వసంధరా రాజే తనదైన శైలిలో మండిపడ్డారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ జహ్లాట్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబూల్ రాజీనామాను ముఖ్యమంత్రి జహ్లాట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. జైపూర్ రాష్ట్ర ప్రభుత్వం పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మంత్రి పదవికి ఆయన ముందుగానే రాజీనామా చేసి విపక్షాల ఆందోళనను తగ్గించే యత్నం చేశారు. సెప్టెంబర్ 11వ తేదీన మంత్రి వద్దకు తన సొంత పనిమీద వెళ్లిన మహిళను లైంగిక వేధించడమే కాకుండా, శారీరకంగా హింసించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనిపై చార్జీషీటు మాత్రమే నమోదు చేసిన పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది.