సాక్షి, న్యూఢిల్లీ: గాంధీ-నెహ్రూ కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రజలలో భయాన్ని సృష్టిస్తూ వారిని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ సోమవారం ఆరోపించారు. ఆ ముగ్గురు పేర్లు ప్రస్తావించకుండా కరోనాతో పోరాడుతున్న ఈ సమయంలో వారు ప్రజలను భయపెడుతూ తప్పు దోవ పట్టిస్తున్నారు. ఈ మహమ్మారి పోయే వరకు వారిని క్వారంటైన్‌లో ఉంచాలని అన్నారు. ఆయన మాట్లాడుతూ... అందరూ బాధపడుతున్నారు. కానీ తప్పదు ఇది అత్యవసరమైన పరిస్థితి. కానీ ఒక కుటుంబం ఉంది. అది 50 సంవత్సరాలు పరిపాలించింది. కానీ అది ఇప్పుడు ప్రజల్లో భయాందోళనని కలిగిస్తూ వారిని తప్పుదోవ పట్టిస్తోంది. అందుకే వారిని ఈ మహమ్మారి ముగిసేవరకు క్వారంటైన్‌లో ఉంచాలి అని అన్నారు. (గవర్నర్తో మాజీ సీఎం రాణే భేటీ)
వర్మ ఇదే కాకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. గత వారం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఢిల్లీ ప్రభుత్వం 3000 పడకలు అని కోవిడ్-19 బాధితుల కోసం ఏర్పాటు చేశాము అని తెలిపితే సీఎం కేజ్రీవాల్ 30,000 పడకలు అని చెప్పారు అని విమర్శించారు. ఢిల్లీ ప్రజలు ఆయన ఏం చెప్పినా నమ్ముతారు అనే ఉద్దేశ్యంతో అలా చెప్పారు అని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి చెప్పిన దానికి నిజంగా ఏర్పాటు చేసిన పడకలకి చాలా గ్యాప్ ఉందన్నారు. ఇంకా అరవింద్ కేజ్రీవాల్ 10 లక్షల మందికి భోజనం పెడుతున్నామని, బస్సులు, రైళ్లు ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నారు. ఆయన ఎంతైనా చెప్పొచ్చు ఎందుకంటే లెక్కపెట్టే వారు ఎవరూ లేరు కదా అని అన్నారు. (యుద్ధానికి మా ఆర్మీ సిద్ధం: నేపాల్ మంత్రి)
Comments
Please login to add a commentAdd a comment