
ఒకేసారి రెండు డిగ్రీలు కుదరదు: యూజీసీ
న్యూఢిల్లీ: విద్యార్థులు ఒకేసారి రెండు డిగ్రీలు చేసేందుకు అనుమతించాలన్న ప్రతిపాదనకు ఇప్పటివరకు సానుకూల స్పందన రాలేదని మంగళవారం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తెలిపింది. అందువల్ల వర్సిటీలు గత నిబంధనల ప్రకారమే నడుచుకోవాలంది.
రెగ్యులర్ విధానంలో ఒక డిగ్రీ చేస్తున్న విద్యార్థి.. దూరవిద్య, లేదా ఓపెన్ విధానంలో మరో డిగ్రీ చేసేందుకు అనుమతించాలని యూజీసీ నిపుణుల కమిటీ గతంలో సూచించింది. అయితే, ఈ ప్రతిపాదనను అన్ని వర్గాలూ వ్యతిరేక రావడంతో తాజాగా వెల్లడించింది.