ఈయన ఎవరో మీకు తెలుసా ? | can you identify this national leader | Sakshi
Sakshi News home page

ఈయన ఎవరో మీకు తెలుసా ?

Published Fri, Jun 26 2015 5:55 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

ఈయన ఎవరో మీకు తెలుసా ? - Sakshi

ఈయన ఎవరో మీకు తెలుసా ?

న్యూఢిల్లీ: తలపాగా, గెడ్డం, నల్ల కళ్లద్దాలతో కనిపిస్తున్న ఈయన ఎవరో తెలుసా? ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల వాళ్లు ఆరాధిస్తున్న నాయకుడీయన. ఇప్పటికైనా గుర్తుపట్టగలరా? ఎవరూ గుర్తు పడకూడదనే ఇలా తయారయ్యాడు. ఇది ఎమర్జెన్సీ కాలంలోనిది. ఆ పరిస్థితులు ఆయన్ని అలా చేశాయేమో! ఆయన పేరు ఇప్పుడు చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. ఎమర్జెన్సీ చీకటి అధ్యాయమంటూ కితాబిచ్చారు. ఆయనేనండీ.. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ! ఆ ఫొటోలో మారువేషంలో ఉన్నది నరేంద్ర మోదీనే. ఎమర్జెన్సీ కాలంలో అలా మారువేషంలో తిరిగారట.

మనదేశంలో ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) విధించి 40 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భారత్‌లో ఎమర్జెన్సీ చీకటి రోజులను తలపించిందని ఆయన గురువారం ట్విటర్‌లో రాశారు. ఆ సమయంలో పలువురు ప్రతిపక్ష నాయకులను జైళ్లలో బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement