emergency time
-
ఎమర్జెన్సీ తప్పేనని నాడు ఇందిరనే ఒప్పుకున్నారు: చిదంబరం
ఢిల్లీ: దేశంలో ప్రస్తుతం 1975 నాటి ఎమర్జెన్సీపైనే ప్రత్యేకంగా రాజకీయంగా చర్చ జరుగుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జూన్ 25వ తేదీని రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ విధించడం పొరపాటని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా అంగీకరించారని చిదంబరం చెప్పుకొచ్చారు.కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ చిదంబరం తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘దేశంలో నేడు ఎన్నో సమస్యలు ఉన్నాయి. గతాన్ని బీజేపీ మర్చిపోవాలి. ఇవాళ దేశంలో నివసిస్తున్న 75 శాతం ప్రజలు 1975 తర్వాత పుట్టినవారే ఉన్నారు. 50 ఏళ్ల క్రితం నాటి ఎమర్జెన్సీ గురించి ఈరోజు చర్చించుకోవాల్సిన అవసరం లేదు కాదా?. గతం నుంచి పాఠాలు నేర్చుకుంటే సరిపోతుంది. అయినా, ఎమర్జెన్సీ విధించడం పొరపాటు అని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కూడా అంగీకరించారు’ అని గుర్తు చేశారు.ఇదిలా ఉండగా.. కేంద్రం జూలై 25వ తేదీని రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించడంపై అంతకుముందు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రతిరోజూ ‘రాజ్యాంగ హత్య’కు పాల్పడుతోందన్నారు. దేశంలోని పేదలు, అణగారిన ప్రజల ఆత్మగౌరవాన్ని దోచుకుంటోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. సీనియర్ నేత జైరాం రమేష్.. ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఫలితాలు విడుదలైన రోజును(జూన్ 4)ను మోదీ ముక్తీ దివస్‌గా జరుపుకోవాలని సూచించారు. -
Lok Sabha Election 2024: ఎమర్జెన్సీలో రాజ్యాంగం గొంతు నొక్కారు
హోషియార్పూర్: ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగం గొంతు పిసికిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజ్యాంగ పరిరక్షణ అంటూ గొంతు చించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. 1984 నాటి అల్లర్లలో సిక్కుల మెడలకు టైర్లు బిగించి, నిప్పంటించి కాల్చి చంపుతుంటే కాంగ్రెస్‌కు రాజ్యాంగం గుర్తుకు రాలేదని ధ్వజమెత్తారు. గురువారం పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో మోదీకి ఇదే చివరి సభ. రిజర్వేషన్లపై కాంగ్రెస్‌తోపాటు విపక్ష ‘ఇండియా’ కూటమి ఉద్దేశాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లలో కోత విధించి, బడుగు బలహీనవర్గాలకు అన్యాయం చేసిన చరిత్ర ప్రతిపక్షాలకు ఉందన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కట్టబెట్టేందుకు విపక్షాలు ప్రయతి్నస్తున్నాయని దుయ్యబట్టారు. రాజ్యాంగ స్ఫూర్తిని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనోభావాలను ప్రతిపక్షాలు కించపరుస్తున్నాయని ఆక్షేపించారు. అవినీతిలో కాంగ్రెస్ డబుల్ పీహెచ్డీ కాంగ్రెస్ పార్టీ అవినీతికి తల్లిలాంటిదని ప్రధానమంత్రి నిప్పులు చెరిగారు. అవినీతిలో ఆ పార్టీ డబుల్ పీహెచ్డీ చేసిందని ఎద్దేవా చేశారు. మరో అవినీతి పారీ్ట(ఆమ్ ఆద్మీ పార్టీ) కాంగ్రెస్‌తో చేతులు కలిపిందన్నారు. ఢిల్లీలో కలిసికట్టుగా, పంజాబ్‌లో విడివిడిగా పోటీ చేస్తూ ఆ రెండు పారీ్టలు డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ గర్భంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఊపిరి పోసుకుందని అన్నారు. కాంగ్రెస్ నుంచే అవినీతి పాఠాలు చేర్చుకుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాల్లో మునిగి తేలుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సైనిక దళాలను బలహీనపర్చిందని ఆరోపించారు. సైన్యంలో సంస్కరణలు చేపట్టడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదన్నారు. ఓటింగ్‌లో కొత్త రికార్డు సృష్టించాలి వారణాసి ప్రజలకు ప్రధాని పిలుపు లక్నో: సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. వారణాసిలో శనివారం పోలింగ్ జరుగనుంది. తన నియోజకవర్గ ప్రజలకు మోదీ గురువారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. భారతదేశ అభివృద్ధి కోసం వారణాసి ఓటింగ్‌లో కొత్త రికార్డు సృష్టించాలని పిలుపునిచ్చారు. కాశీ విశ్వనాథుడితోపాటు అక్కడి ప్రజల ఆశీర్వచనాలతోనే పార్లమెంట్లో వారణాసికి ప్రాతినిధ్యం వహించే అవకాశం తనకు దక్కిందని పేర్కొన్నారు. పవిత్ర గంగామాత తనను దత్తత తీసుకుందన్నారు. నవకాశీతోపాటు ‘అభివృద్ధి చెందిన భారత్’ను సాకారం చేసుకోవడానికి ఈ ఎన్నికలు చాలా కీలకమని వివరించారు. జూన్ 1న జరిగే ఓటింగ్‌లో వారణాసి ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలని, ఓటింగ్‌లో కొత్త రికార్డు సృష్టించాలని మోదీ విజ్ఞప్తి చేశారు. కాశీని ఎంతో అభివృద్ధి చేశామని, రాబోయే రోజుల్లో ఈ అభివృద్ధిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని మోదీ హామీ ఇచ్చారు. కన్యాకుమారిలో మోదీ ధ్యానముద్ర సాక్షి, చెన్నై: తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్లోని ధ్యాన మండపంలో ప్రధాని మోదీ గురువారం సాయంత్రం ధ్యానం ప్రారంభించారు. దాదాపు 45 గంటపాటు ఆయన ధ్యానం కొనసాగించనున్నారు. మోదీ తొలుత కేరళలోని తిరువనంతపురం నుంచి హెలికాప్టర్లో కన్యాకుమారికి చేరుకున్నారు. సంప్రదాయ ధోతీ, తెల్ల రంగు కండువా ధరించి భగవతి అమ్మన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మోదీ సముద్ర తీరం నుంచి పడవలో రాక్ మెమోరియల్‌కు చేరుకున్నారు. ధ్యాన మండపం మెట్లపై కాసేపు కూర్చుకున్నారు. తర్వాత ధ్యాన మండపంలో సుదీర్ఘ ధ్యానానికి శ్రీకారం చుట్టారు. -
మీ ఫ్యామిలీ బడ్జెట్ వేశారా?
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి వచ్చేసరికి ప్రభుత్వాలు బడ్జెట్ పై కసరత్తు చేస్తుంటాయి. అది పెద్దస్థాయి కదా మనకెందుకులే అని వదిలేయద్దు. ఎందుకంటే, ఖర్చు ఎక్కడ పెట్టాలి..? ఎక్కడ తగ్గించుకోవాలి..? ఎంత మొత్తం పొదుపు చేయాలి..? వీటన్నింటికంటే ముందు ఆదాయం ఎంత? అన్న అంశాలపై అవగాహన ప్రతి కుటుంబానికీ కూడా ఉండాలి. అదే బడ్జెట్ ప్లానింగ్. మొన్న కేంద్ర బడ్జెట్ విడుదలైంది. ఇప్పుడు మన ఫ్యామిలీ బడ్జెట్ వంతు వచ్చింది. ఏమంటారు? నెలవారీ జీతాలతో లేదా స్వయం ఉపాధితో జీవనం సాగించే వారికి నెలవారీ బడ్జెట్ ప్లానింగ్ అత్యవసరం. మనకు వచ్చేదెంత? అందులో మనం దేనికి, ఎంత ఖర్చుపెట్టాలి..? ఎక్కడ ఆదా చేయాలి..? అన్న అంశాలపై అవగాహన ఉంటే ఇంటి నిర్వహణ సులువు అవుతుంది. బడ్జెట్ ప్లానింగ్ ఉంటే మీ నెలవారీ ఖర్చులను సులభంగా నిర్వహించుకోవచ్చు. అత్యవసర పరిస్థితి కోసం కొంత మొత్తం జీవితంలో పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. అందుకే కొంత మొత్తాన్ని అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవడానికి వీలుగా.. మీ చేతికి వస్తున్న సంపాదనలో 20 నుంచి 30 శాతం వరకూ పొదుపు చేయడం మంచిది. ఒకవేళ ఇంత మొత్తంలో చేయలేకపోయినా.. అవకాశం ఉన్న మేరకు పక్కన పెట్టాలని పెద్దల సలహా. కుటుంబ సభ్యుల ఆమోదం: ఫలానా దానికి ఇంత మొత్తం ఖర్చు పెట్టాలి అని మీరు ఒక గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఇంట్లోని ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి. అలా ఉండాలంటే ముందుగా మీరు చేయాల్సింది... నెలవారీ బడ్జెట్ ప్లానింగ్ కోసం కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి వివరించాలి. రాబడి, ఖర్చుల విషయాలను అందరితో చర్చించాలి. అప్పుడు వారికి కూడా అవగాహన ఏర్పడి, ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. వృథాను అరికట్టాలి మనం పొదుపు చేయాలి అంటే కుటుంబంలో అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. ఏది అవసరం, ఏది అనవసరం అనే అవగాహన ఉండాలి. ముఖ్యంగా వృథా ఖర్చులను తగ్గించాలి. సరుకులు లేదా వస్తు సామగ్రిని ఎక్కువెక్కువ తెచ్చుకోవడం, ఇష్టం వచ్చినంత వండటం, పారెయ్యటం వల్ల ఎంతో డబ్బు వృథా అవుతుంది. అందువల్ల అట్లాంటి వృథాకు అడ్డుకట్ట వేయాలి. క్రెడిట్ కార్డుతో జాగ్రత్త.. క్రెడిట్ కార్డు ఉన్నది అత్యవసర సమయంలో ఉపయోగపడటానికి మాత్రమే అని గుర్తుంచుకోవాలి. చేతిలో కార్డు ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చుపెట్టకూడదు. మీ నెలవారీ రాబడిని అంచనా వేసుకొని అప్పుడు మాత్రమే కార్డును వినియోగించాలి. పొదుపు పథకాల్లో.. ఇలా ప్రతి నెలా బడ్జెట్ ప్లానింగ్ చేసుకొని ఆదా చేసిన సొమ్మును ఖతాలో అలా ఉంచకుండా.. మార్కెట్ రిస్క్ లేని పెట్టుబడి పథకాలు అంటే గోల్డ్, రియల్ ఎస్టేట్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టాలి. అప్పుడు దీర్ఘకాలంలో మంచి రాబడులు వచ్చే అవకాశం ఉంటుంది. పొదుపు ఎంత ఉండాలి? ఇది కాస్త క్లిష్టమైన ప్రశ్నే. పొదుపు చేయాలంటే ముందు మన ఆదాయాన్ని అంచనా వేసుకోవాలి. ఎందుకంటే, ఆదాయాన్ని బట్టి పొదుపు శాతం పెరుగుతూ, తరుగుతూ ఉంటుంది. అయితే, ఆదాయంతో సంబంధం లేకుండా, సాధారణ కుటుంబ ఖర్చులు మినహా మరే విధమైన అదనపు ఖర్చులూ లేకుండా ఉంటే పొదుపు ఎంత ఉండాలో చెప్పడానికి కొన్ని సూత్రాలు... ప్రతి మనిషి కనీసం ఆరునెలల జీతం లేదా ఆదాయాన్ని నగదు రూపంలో దాచుకోవాలి. ఒకవేళ ఒకేసారి అలా దాచుకోలేని వారు నెలనెలా కొంత పక్కనపెడుతూ ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. కుటుంబ ఖర్చుకు సమానమైన ఆదాయం లేదా అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న దిగువ మధ్యతరగతి వారు తమ ఆదాయం లో ఐదు నుంచి పది శాతం పొదుపు చేయాలి. పొదుపు చేయడానికి మిగలక పోయినా ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారానో, ఖర్చును తగ్గించుకోవడం ద్వారానో కచ్చితంగా పొదుపు చేయాలి. నెలవారీ సగటు కుటుంబ ఖర్చు కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించేవాళ్లు నెలనెలా 25 శాతం పొదుపు చేయాలి. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తుంటే భర్త ఇంటి ఖర్చులు పెడతారు కాబట్టి భార్య 50 శాతం పొదుపుచేయాలి. అధికాదాయ వర్గాలు అయితే కుటుంబ ఆదాయంలో సగం పొదుపునకు మళ్లించాలి. భవిష్యత్తులో ఆదాయం పొరపాటున తలకిందులైతే ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఇలా చేసిన పొదుపు ఆదుకుంటుంది. పొదుపు మార్గాలు కొన్ని... ► అవసరం లేకుండా డిస్కౌంట్లలో వచ్చే వస్తువులు కొనద్దు. ► అవసరానికి ముందే ఏ వస్తువులనూ కొనుగోలు చేయకండి. ► నిర్దిష్ట తేదీల్లోపు బిల్లులు చెల్లించండి. దీని కోసం బిల్స్ పే క్యాలెండర్ తయారు చేసుకోవాలి. ► మీ బ్యాంకు ఖాతాలు ప్రతి నెల చివరన చూసుకోండి. వృథా ఖర్చులు తెలుస్తాయి. వృథా ఖర్చుల జాబితా రాయండి. ప్రతినెలా ఎంత వృథా పోతుందో తెలిస్తే ఆటోమేటిక్‌గా అప్రమత్తత పెరుగుతుంది. ► ఏ వస్తువు కొనాలన్నా ఇంటర్నెట్æద్వారా వివిధ మాల్స్/దుకాణాల్లో వాటి ధరల తేడాలు చూసి ఎక్కడ తక్కువో అక్కడ కొనండి. ఎందుకంటే ప్రతి డీలరు వేర్వేరు ధరలపై వస్తువులను అమ్ముతారు. చివరగా ఒక మాట... మీ బడ్జెట్ ఎంత పకడ్బందీగా ఉంటే భవిష్యత్తు అంత భద్రంగా ఉంటుందని గుర్తు పెట్టుకోండి. అదేవిధంగా మీ పిల్లలకు కూడా ఇప్పటినుంచే పొదుపు చేయడాన్ని అలవాటు చేయండి. వారికి ఇచ్చే పాకెట్ మనీతో వారికి కావలసిన వాటిని ఎలా కొనుక్కోవాలో నేర్పించండి. అప్పుడే మీరు పర్ఫెక్ట్ ఫైనాన్స్ మేనేజర్ లేదా నిపుణులైన హోమ్ మినిస్టర్ అవుతారు. ఇంతవరకు మీరు బడ్జెట్ వేసుకోకపోతే ఇప్పుడైనా వేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి.. మీ బడ్జెట్‌ను నెలవారీ రివ్యూ చేసుకోవాలి. ఏమైనా మార్పులు అవసరం అయితే కచ్చితంగా ఆయా మార్పులు చేసుకోవాలి. ఇందుకోసం మీ కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకోవాలి. కచ్చితంగా పెట్టవలసిన ఖర్చును పక్కన పెట్టి.. ఇంకా ఏమైనా ఆదా చేసుకునే మార్గం ఉందేమో చూడాలి. -
మౌనంగా నిష్క్రమించిన ‘ధిక్కారం’
రాం మనోహర్ లోహియా సిద్ధాంతాలతో ప్రభావితుడై నూనూగు మీసాల ప్రాయంలోనే కార్మికో ద్యమంలో అడుగుపెట్టి, తిరుగులేని కార్మిక నాయకుడిగా ఎదిగి అధికార పీఠాన్ని గడగడలాడించిన జార్జి ఫెర్నాండెజ్ మంగళవారం 88 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొన్ని దశాబ్దాలపాటు క్షణ కాలం తీరికలేనంతగా ఉద్యమాలతో మమేకమై, ఆ తర్వాత పార్లమెంటరీ రాజకీయాల్లో తలమున కలై, కేంద్రమంత్రిగా వివిధ హోదాల్లో పనిచేసిన ఫైర్‌బ్రాండ్ ఫెర్నాండెజ్ గత పదేళ్లుగా అనారోగ్యం బారినపడి ఎవరినీ గుర్తుపట్టలేని నిస్సహాయస్థితికి చేరుకున్నారు. తన లోకంలో తాను ఉండి పోయారు. చెప్పాలంటే ఫెర్నాండెజ్ మరణమే ఇప్పుడు ఆయన్ను మళ్లీ ప్రజాజీవన రంగంలో ప్రస్తావనాంశంగా మార్చింది. కేథలిక్ మతాచార్యుడిగా తీర్చిదిద్దాలనుకున్న అమ్మానాన్నలను కాదని 8 అణాలతో ముంబై మహానగరంలో ఆయన అడుగుపెట్టాడు. చిన్నా చితకా పనులు చేసు కుంటూ రాత్రుళ్లు పేవ్మెంట్లపై నిద్రపోయేవాడు. అటువంటి వ్యక్తి అచిరకాలంలోనే ఆ మహా నగరాన్ని స్తంభింపజేసే స్థాయి కార్మికోద్యమ నాయకుడిగా ఎదగడం ఆయన నాయకత్వ పటిమకు తార్కాణం. పది భాషల్ని అనర్గళంగా మాట్లాడగలగటం, దిగ్గజాల్ని సైతం ధిక్కరించడం ఆయన నైజం. బహుశా ఫెర్నాండెజ్ ఇప్పుడూ ఆ బాణీనే కొనసాగిస్తే ‘జాతి వ్యతిరేకి’గా ముద్రపడి జైలు గోడల వెనక మగ్గేవారేమో! తిరుగుబాటుదారన్నా, ధిక్కారస్వరం వినిపించేవారన్నా సాధారణ ప్రజానీకంలో తెలియని ఆపేక్ష ఉంటుంది. వారి సిద్ధాంతాలతో, ఆచరణతో విభేదిస్తున్నా అంతరాంతరాల్లో అది సహజంగా అంకురిస్తుంది. విస్ఫులింగాలు విరజిమ్ముతూ, నరనరాల్లో నెత్తుర్ని ఉప్పొంగింపజేసే ధైర్యశాలిని తమవాడిగా భావించనిదెవరు? కనుకనే కార్మికులంతా చాలా త్వరగానే ఆయన్ను సొంతం చేసు కున్నారు. 1967 సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్.కె. పాటిల్‌ను ఓడిం చాక ఆయన పేరు ఆసేతు హిమాచలం మార్మోగిపోయింది. అందరూ ఆయన్ను ‘జయింట్ కిల్లర్’గా పిలవడం ప్రారంభించారు. మరో ఏడేళ్లకు ప్రారంభమైన రైల్వే సమ్మె ఫెర్నాండెజ్ జీవి తంలో అత్యంత కీలకమైన ఘట్టం. లక్షలమంది కార్మికులను ఒక్కతాటిపై నడిపి సాగించిన ఆ సమ్మె అప్పటి కేంద్ర ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. రైల్వేలో ఇతర సిబ్బందికి ఎప్పటి కప్పుడు వేతనాలు పెంచుతూ లోకో సిబ్బందికి నిర్దిష్ట పనివేళలు లేకుండా, సరైన వేతనాలివ్వ కుండా రాచిరంపాన పెట్టేవారు. ఒకసారి వారు రైలు ఎక్కారంటే దాన్ని గమ్యస్థానం చేర్చేవరకూ వారిదే బాధ్యత. అందుకు ఎన్నిరోజులు పట్టినా డ్యూటీలో కొనసాగాల్సిందే. కేంద్రప్రభుత్వాధీ నంలో ఉన్న అతి పెద్ద సంస్థ బాహాటంగా చట్టాలను ఉల్లంఘిస్తున్న తీరును రైల్వే సమ్మె ప్రశ్నిం చింది. కనుకనే రైల్వే కార్మికుల్లో 70 శాతంమంది అందులో భాగస్వాములయ్యారు. ఆనాటి ప్రభుత్వం ఉక్కుపాదంతో దాన్ని అణిచివేసింది. లక్షలమందిని జైళ్లలో బంధించి, వేలాదిమందిని ఉద్యోగాలనుంచి వెళ్లగొట్టింది. అనంతరకాలంలో విధించిన ఎమర్జెన్సీకి గల అనేక కారణాల్లో రైల్వే సమ్మె ఒకటి. ఆ నిర్బంధకాలంలో ఫెర్నాండెజ్ కోసం పోలీసులు వేంటాడి, వేటాడి అరెస్టుచేశారు. బరోడా డైనమైట్ కేసులో ముద్దాయిని చేశారు. ఆయన్ను అవమానించాలని గొలుసులతో బంధించి నడిపించారు. నిజానికి ఆ ఛాయాచిత్రమే లోక్‌సభ ఎన్నికల్లో అతి పెద్ద ప్రచారాస్త్రంగా మారి, జైల్లో ఉండగానే ఆయనకు ఘనవిజయాన్ని సాధించిపెట్టింది. ఎమర్జెన్సీ అనంతరం ఆయన హక్కుల సంఘాలతో కూడా సన్నిహితంగా పనిచేశారు. దేశంలో ఏ మూల హక్కుల ఉల్లంఘన జరిగినా, దానికి వ్యతిరేకంగా పోరాడే సంస్థలకు ఆయన దన్నుగా నిలబడేవారు. అవి చిన్నవా, పెద్దవా... వాటి వెనక ఉండే జనం ఎంతమంది అన్న అంశాలు ఆయన లెక్కజేసేవారు కాదు. అది నెత్తురోడిన ఇంద్రవెల్లి కావొచ్చు...మరోచోట గని కార్మికుల సమ్మె కావొచ్చు–ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఫెర్నాండెజ్ ప్రత్యక్షం కావాల్సిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన చిలకలూరిపేట బస్సు దహనం కేసులో ఉరిశిక్షపడిన ఇద్దరు దళిత యువకుల ప్రాణాలను కాపా డటంలో ఫెర్నాండెజ్ తీసుకున్న చొరవ మరవలేనిది. ‘అలజడి మా జీవితం... ఆందోళన మా ఊపిరి’ అనుకుంటూ పోరుబాట పడుతున్న యువ తను అప్పట్లో లోహియా సిద్ధాంతాలతో ప్రభావితమై పనిచేస్తున్న పలువురు ఆలోచింపజేశారు. హింసామార్గం కాక వేరే పోరాట విధానాలున్నాయని అభిప్రాయం కలగజేయడంలో వీరి పాత్ర గణనీయమైనది. అందులో ఫెర్నాండెజ్ ముఖ్యుడు. ఆయన పేరు చెబితే ఎప్పుడూ చెదిరి ఉండే జుత్తు, నలిగిపోయిన కుర్తా, పైజమా, భుజానికో సంచీ గుర్తొస్తాయి. ఆయనే కాదు... అప్పట్లో చాలామంది లోహియావాదుల ఆహార్యం అదే. కానీ విషాదమేమంటే ఆ వర్గంలోని అందరి మాదిరే ఫెర్నాండెజ్ కూడా సగటు రాజకీయవేత్తగా మారిపోయారు. ఒకప్పుడు వ్యవస్థకు పక్కలో బల్లెంగా ఉన్నవాడు అందులో భాగం కావడం మాత్రమే కాదు... ఆ రాజకీయపుటెత్తుల్లో కీలకంగా మారడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. జనతాపార్టీ పాలనలో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌కి వెన్నుదన్నుగా నిలిచి ద్వంద్వ సభ్యత్వం ఉన్నవారికి చోటులేదంటూ పరోక్షంగా పార్టీలో ఆరెస్సెస్ అనుకూలవాదులపై దాడి చేసిన ఫెర్నాండెజ్ 24 గంటలు తిరగకుండా అందుకు భిన్న మైన వైఖరి తీసుకోవడం ఎవరికీ రుచించలేదు. అనంతరకాలంలో ఆయన ఎన్డీఏలో మంత్రిగా పనిచేశారు. తెహెల్కా స్టింగ్ ఆపరేషన్ వ్యక్తిగతంగా ఫెర్నాండెజ్‌ను అవినీతిపరుడని నిరూపించ లేకపోయింది. ఆయన రక్షణమంత్రిగా ఉన్నప్పుడు జరిగాయన్న శవపేటికల కుంభకోణం, బరాక్ క్షిపణుల స్కాంలో కమిషన్లు విచారణ జరిపి ఆయన ప్రమేయం లేదని తేల్చాయి. ఆయన ఎన్ని తప్పటడుగులు వేసినా, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఇప్పటికీ, ఎప్పటికీ ‘రెబల్’ ఫెర్నాండెజ్ మాత్రమే జనం గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. -
ఈయన ఎవరో మీకు తెలుసా ?
న్యూఢిల్లీ: తలపాగా, గెడ్డం, నల్ల కళ్లద్దాలతో కనిపిస్తున్న ఈయన ఎవరో తెలుసా? ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల వాళ్లు ఆరాధిస్తున్న నాయకుడీయన. ఇప్పటికైనా గుర్తుపట్టగలరా? ఎవరూ గుర్తు పడకూడదనే ఇలా తయారయ్యాడు. ఇది ఎమర్జెన్సీ కాలంలోనిది. ఆ పరిస్థితులు ఆయన్ని అలా చేశాయేమో! ఆయన పేరు ఇప్పుడు చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. ఎమర్జెన్సీ చీకటి అధ్యాయమంటూ కితాబిచ్చారు. ఆయనేనండీ.. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ! ఆ ఫొటోలో మారువేషంలో ఉన్నది నరేంద్ర మోదీనే. ఎమర్జెన్సీ కాలంలో అలా మారువేషంలో తిరిగారట. మనదేశంలో ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) విధించి 40 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భారత్‌లో ఎమర్జెన్సీ చీకటి రోజులను తలపించిందని ఆయన గురువారం ట్విటర్లో రాశారు. ఆ సమయంలో పలువురు ప్రతిపక్ష నాయకులను జైళ్లలో బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఈ పాపం ఎవరిది?
సాక్షి, నెల్లూరు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం గాలిలో దీపమని మరోసారి తేలింది. అత్యవసర పరిస్థితుల్లో సర్కారు డాక్టర్లను నమ్ముకుంటే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని రూడీ అయింది. వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన వారు సకాలంలో వైద్యసేవలు అందకే ప్రాణాలు కోల్పోయారు. వారికి సేవలు అందించడంలో జరిగిన తీవ్రజాప్యంతో నెల్లూరులోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాల(పెద్దాసుపత్రి)లో సేవల డొల్లతనం బయటపడింది. వైద్యాధికారులు, సిబ్బంది వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరిగినా కలెక్టర్ శ్రీకాంత్ వైద్యాధికారులపై కఠిన చర్యలు తీసుకోకుండా మాటలతో సరిపెట్టడాన్ని వైద్యశాఖలోని కొందరే ఆక్షేపిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌గా శ్రీకాంత్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైద్యశాఖపై ప్రత్యేక దృష్టిసారించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి విషయంలో కఠినచర్యలు తీసుకోకుండా ఆయన మాటలతో సరిపెడుతుం డటంతో పరిస్థితిలో మార్పు కరువైంది. వైద్యసేవల్లో తీవ్రజాప్యం జిల్లాలో 24 గంటలూ సేవలందిచాల్సిన ఆస్పత్రులు 45 ఉన్నాయి. ఇవేమి 24 గంటల పాటు పనిచేస్తున్న దాఖలాలు లేవు. శనివారం రోడ్డుప్రమాదం జరిగిన వెంకటాచలం టోల్‌ప్లాజాకు సమీపంలోనే 24 గంటలూ పనిచేసే క్లస్టర్ ఆసుపత్రి ఉంది. ఆస్పత్రి వైద్యు లు, సిబ్బంది విధుల్లో ఉండి గాయపడిన వారికి సకాలంలో వైద్యసేవలు అంది ఉంటే ప్రాణాలు కోల్పోయిన ఇద్దరైనా బతికే అవకాశాలు ఉండేవి. అయినా వెంకటాచలం అసుపత్రి సిబ్బందిపై చ ర్యలు లేవు. ఇక డీఎస్ఆర్ ఆసుపత్రి విషయానికొ స్తే తెల్లవారుజామున 5 గంటలకే క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారందరూ అంబులెన్స్ దిగి నడిచి లోపలకు వెళ్లారు. ఆ సమయానికి ఉండాల్సిన ఇద్దరు డ్యూ టీ డాక్టర్లతో పాటు సిబ్బంది కనిపించలేదు. గా యపడిన వారిని పట్టించుకునే వారే కరువయ్యా రు. ఉదయం 8.30 గంటలకు ఆర్డీఓ సుబ్రమణ్యేశ్వరరెడ్డి ఆసుపత్రికి చేరుకుని వైద్యులకు ఫోన్ చే శారు. 9 గంటలకు జేసీ లక్ష్మీకాంతం, 9.15 గంట లకు కలెక్టర్ శ్రీకాంత్ చేరుకున్నారు. అప్పటికీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాలేదు. డ్యూటీ డా క్టర్లూ కనిపించలేదు. ఇక మెడికల్ కళాశాలకు సం బంధించి వేలాది రూపాయల జీతాలు తీసుకుం టున్న పదుల సంఖ్యలో డాక్టర్లు ఏమయ్యారో అ ధికారులకే తెలియాలి. వైద్యాధికారుల నిర్లక్ష్యంతో గాయాలతో ఆసుపత్రిలోకి నడిచి వచ్చిన బాధితులు నాలుగు గంటల పాటు వైద్యసేవలు అంద క శవాలుగా మారి స్ట్రెచర్లపై బయటకు వచ్చా రు. ఈ పాపం ఆసుపత్రి సిబ్బందిదా.. వైద్యాధి కారులదా..జిల్లా అధికారులదా..కఠినంగా వ్యవహరించని ఉన్నతాధికారులదా! ఉన్నతాధికారులే సాక్షులు ఉదయం 9 గంటల తర్వాతే సూపరిండెంటెంట్ తో పాటు మిగిలిన వైద్యాధికారులు ఆస్పత్రికి వ చ్చారు. అందుకు కలెక్టర్, జేసీ, ఆర్డీఓలే సాక్షులు. నిండు ప్రాణాలు గాలిలో కలిసేందుకు కారణమైన అధికారులపై అక్కడికక్కడే చర్యలు తీసుకోవాల్సిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. విచారణ పేరుతో కలెక్టర్ తాత్సారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యాధికారుల నిర్లక్ష్యంపై తనతో పాటు జేసీ ప్రత్యక్షసాక్షులుగా ఉంటే ఇక ఆర్డీఓతో విచారణ ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. మంత్రి సేవలో జిల్లా వైద్యాధికారి ఓ వైపు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయినా జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారికి పట్టలేదు. కనీసం పెద్దాసుపత్రి వై పు కన్నెత్తి చూడకుండా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సేవలో తరించేందుకు రొట్టెల పండగ లో తలమునకలయ్యారు. అధికారులు సకాలం లో స్పందించి ఉంటే కొందరి ప్రాణాలైనా కాపాడగలిగేవారు. నెల్లూరులో వందలాది మంది వైద్యు లు నివాసముంటున్నారు. ఉన్నతాధికారులతో పాటు జిల్లా వైద్యాధికారి జిల్లా కేంద్రంలోనే ఉ న్నారు. అధికారులు సీరియస్‌గా స్పందించి ఉం టే అరగంటలోపే వందల మంది డాక్టర్లు పెద్దాసుపత్రికి చేరుకునే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన విషయం ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తెలిసినా డాక్టర్లను పిలిపించే ప్రయత్నం ఎవరూ చేయలేదు. కలెక్టర్, జే సీ, ఆర్డీఓ ఆస్పత్రిలో ఉన్నారని తెలుసుకున్నా వైద్యాధికారులు నింపాదిగా రావడం దురదృష్టకరం.ఘోరరోడ్డు ప్రమాదం జరిగిన సమయంలోనే ఇలా స్పందిస్తే సాధారణ సమయాల్లో వీరు విధులకు ఏమేరకు హాజరవుతారనేది ప్రశ్నార్థకమే. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో సేవలు మెరుగయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. కఠినంగా వ్యవహరిస్తాం : శ్రీకాంత్, కలెక్టర్ విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వైద్యాధికారులపై కఠినచర్యలు తప్పవు. పెద్దాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై ఆర్డీఓ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతా.