
సాక్షి, న్యూఢిల్లీ : విభేదాలతో రచ్చకెక్కిన సీబీఐని ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పలువురు అధికారులపై బదిలీ వేటు వేసిన ప్రభుత్వం రాకేష్ ఆస్తానా, అలోక్ వర్మ బృందాల్లో పనిచేస్తూ వారితో సన్నిహితంగా ఉంటున్న వారిని బదిలీల్లో టార్గెట్ చేసింది. సీబీఐ జాయింట్ డైరెక్టర్ సాయి మనోహర్‌ను చండీగఢ్‌కు బదిలీ చేశారు. రాకేష్ ఆస్థానా కేసు దర్యాప్తు చేస్తున్న ముగ్గురు అధికారులను సీబీఐ బదిలీ చేసింది.
సీబీఐ బదిలీలు చేసిన సీనియర్ అధికారుల్లో డిప్యూటీ ఎస్పీ ఏకే బస్సీ, అదనపు ఎస్పీ ఎస్‌ఎస్ గుర్మ్, డీఐజీ మనీష్ కుమార్ సింగ్, ఏసీబీ డీఐజీ తరుణ్ గౌబా, డీఐజీలు జస్బీర్ సింగ్, అనిష్ ప్రసాద్, కేఆర్ చురాసియా, రామ్ గోపాల్, ఎస్పీ సతీష్ దగార్, అరుణ్ కుమార్ శర్మ, ఏ సాయి మనోహర్, వి. మురుగేశన్, అమిత్ కుమార్‌లున్నారు. మొత్తం 13 మంది అధికారులను సీబీఐ బదిలీ చేసింది. మరోవైపు సీబీఐ నూతన చీఫ్‌గా నియమితులైన నాగేశ్వరరావుపైనా అవినీతి ఆరోపణలున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment