
సాక్షి,న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ ఏడాది నవంబర్ 29 నాటికి పది లక్షల ఇళ్లను నిర్మించడం ద్వారా లక్ష్యాన్ని చేరుకున్నామని కేంద్రం తెలిపింది. ఈ పథకం కింద 2019 మార్చి నాటికి దేశవ్యాప్తంగా కోటి ఇళ్లు నిర్మించాలని ప్రధాని మోదీ లక్ష్యంగా నిర్ధేశించారు.
మార్చి 2018 నాటికి 50 లక్షల మంది గృహ లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా వారి ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి గ్రామీణాభివృద్ధి శాఖ పలు చర్యలు చేపడుతోందని ప్రభుత్వం పేర్కొంది.57 లక్షల మందికి ఇళ్లు మంజూరు కాగా, వీరిలో 51.39 లక్షల మంది లబ్ధిదారులు తొలివాయిదాను(బిల్లులు) అందుకున్నారని, మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు వివరించారు.
ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్,మధ్యప్రదేశ్,మహారాష్ట్ర,ఒరిస్సా, రాజస్ధాన్ రాష్ట్రల్లో అత్యధిక గృహాలు పూర్తయ్యాయని, నివాసానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment