ఇరు రాష్ట్రాల నుంచి 34 పీటీఓలకు గుర్తింపు | Centre released Hazz yatra quota | Sakshi
Sakshi News home page

ఇరు రాష్ట్రాల నుంచి 34 పీటీఓలకు గుర్తింపు

Published Fri, Jun 30 2017 1:43 AM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM

ఈ ఏడాది హజ్‌యాత్రకు తీసుకెళ్లేందుకు ప్రైవేటు టూర్‌ ఆపరేటర్ల (పీటీఓ) కోటాను కేంద్రం విడుదల చేసింది.

హజ్‌యాత్రకు పీటీఓల కోటా విడుదల చేసిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది హజ్‌యాత్రకు తీసుకెళ్లేందుకు ప్రైవేటు టూర్‌ ఆపరేటర్ల (పీటీఓ) కోటాను కేంద్రం విడుదల చేసింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మొత్తం 34 పీటీఓలకు 2,531 యాత్రికుల సీట్లను కేటాయించి నట్లు తెలంగాణ రాష్ట్ర హజ్‌ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్‌.ఎ.షుకూర్‌ తెలిపారు.

గురువారం హైదరాబాద్‌లోని హజ్‌హౌస్‌లోని కమిటీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..మొదటి,రెండవ కేటగిరీలో ఇరు రాష్ట్రాలకు చెందిన మొత్తం 34 పీటీఓలకు యాత్రికులను తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిందన్నారు. ఈ ఏడాది పీటీఓలకు కేటాయించిన 2,531 సీట్లతో పాటు తెలంగాణ రాష్ట్ర హజ్‌ కమిటీ ద్వారా 3,413 మంది హజ్‌యాత్రకు వెళ్లనున్నట్లు తెలిపారు. హజ్‌యాత్రకు వెళ్లేవారు ప్రభుత్వం గుర్తించిన పీటీఓల ద్వారానే వెళ్లాలని సూచించారు.
    
    కేటగిరీ    పీటీఓల సంఖ్య    కేటాయించిన సీట్లు
    1                15                   1581
    2                19                    950

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement