వైఎస్ జగన్ దీక్షకు అనుమతిచ్చేది లేదన్న చంద్రబాబు
న్యూఢిల్లీ : ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న దీక్షకు అనుమతి ఇచ్చేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆయన గురువారం ఢిల్లీలో ప్రెస్మీట్ లో మాట్లాడుతూ 'చచ్చిపోతామని దరఖాస్తు చేస్తే అనుమతి ఇవ్వాలా?. జగన్ ధర్నా చేయాల్సింది గుంటూరులో కాదు...ఢిల్లీలో. ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతుందని అనుకోవడానికే ఇలా చేస్తున్నారు. రోడ్డుపై ధర్నా చేస్తానంటే చూస్తూ ఊరుకుంటామా? బస్సులు తగలబెడతామంటే అనుమతి ఇస్తామా? మీరు కూడా దీక్షలు చేశారు కదా... అని మీడియా ప్రతినిధులును ప్రశ్నిస్తూ' మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. యువభేరిలో పాల్గొన్న ప్రొఫెసర్లపై చర్యలు తీసుకుంటే తప్పేంటి? అని చంద్రబాబు ఎదురు ప్రశ్నించారు.
అంతకు ముందు చంద్రబాబు నాయుడు...కేంద్ర మంత్రులతో భేటీ అయిన వివరాలను మీడియాకు వివరించారు.
* ఏపీకి సాయం చేయాలని అరుణ్ జైట్లీని కోరాం
*విభజనతో జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని కేంద్రాన్ని కోరాం
* అమరావతిలో ఔటర్ రింగ్రోడ్డు నిర్మాణం, కర్నూలు నుంచి అమరావతికి రోడ్డు కోరాం.
* వ్యవసాయా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు 200 కోట్లు మంజూరయింది.
*రాజధాని పరిధిలో 50 ఎకరాలు డీ నోటిఫై చేయాలని కోరాం.
*ఏపీలో విమానయానం పెరిగింది. కనెక్టివిటీ పెంచాలని విజ్ఞప్తి చేశాం.
*ఏపీలో 3 అంతర్జాతీయ విమానావ్రయాలను ఏర్పాటు చేయాల్సి ఉంది.
*పొగాకు రైతు సమస్యలపై కేంద్రమంత్రి నిర్మాలాసీతారామన్తో చర్చించాం.
*పదేళ్ల యూపీఏ పాలనలో నదుల అనుసంధానం నిర్లక్ష్యం చేసింది.
*5 నెలల 20 రోజుల్లో గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చేశాం.
*పోలవరం ప్రాజెక్ట్ కోసం ఈ ఏడాది రూ.1950 కోట్లు ఖర్చు పెట్టాం.
* పోలవరానికి సవరించిన అంచనాలతో నిధులు మంజూరు కోరాం.
*కొత్తగా 17 జాతీయ సంస్థలు ఏపీకి వస్తున్నాయి.
*పామాయిల్, పట్టు పరిశ్రమల సమస్యలను పరిష్కరించాలని కోరాం.
*భవిష్యత్లో విద్యుత్ కొరత లేకుండా చేస్తాం.
*11 విద్యా కేంద్రాలకు భూకేటాయింపులు పూర్తయ్యాయి.
*కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం చేయాల్సి ఉంది.