జస్టిస్ రంజన్ గొగొయ్
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగొయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళ సోమవారం అంతర్గత విచారణ కమిటీ ముందు హాజరై తన వాంగ్మూలం ఇచ్చింది. సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని అయిన ఆమె ఈ విచారణకు హాజరుకావడం ఇది రెండోసారి. ఆమె చేసిన ఆరోపణలపై జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఈ విచారణ చేపట్టింది.
జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీ ఈ కమిటీలోని ఇతర సభ్యురాళ్లు. విచారణ సందర్భంగా బాధితురాలు ఒక్కరినే అనుమతించారని సుప్రీంకోర్టు వర్గాలు వెల్లడించాయి. ఆమె తరపు న్యాయవాది సమర్పించిన ఫిర్యాదును స్వీకరించేందుకు న్యాయమూర్తులు నిరాకరించారు. తదుపరి విచారణ మంగళవారం జరగనుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment