మోదీపై విరుచుకుపడ్డ సోనియాగాంధీ
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళనను ప్రభుత్వం సెన్సార్ చేస్తోందని ఆమె గురువారమిక్కడ ఆరోపించారు. విపక్ష సభ్యులు ఉభయ సభల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి చేస్తున్న నిరసనను తెరపై చూపించకుండా చేస్తున్నారని సోనియా మండిపడ్డారు.
ఇది మోదీ స్టైల్ సెన్సార్‌షిప్ అని మండిపడిన సోనియా.... ప్రభుత్వం విపక్షాల గొంతు నొక్కేస్తోందని దుయ్యబట్టారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ప్రధానిపై విమర్శలు ఎక్కుపెట్టారు. కేంద్రం, రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వస్తున్నా మోదీ ఎందుకు స్పందించటం లేదని సూటిగా ప్రశ్నించారు. వ్యాపం, లలిత్ గేట్పై మోదీ ఎందుకు స్పందించటం లేదంటూ రాహుల్ ప్రశ్నలు సంధించారు.