
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లలో భారత్‌లో 73 మందిని కరోనా బలి తీసుకంది. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1007కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకు భారత్‌లో 31,332 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది. 7,695 మంది కరోనా నుంచి కోలుకున్నారని, ప్రస్తుతం దేశంలో 22,629 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని వెల్లడించింది.
అత్యధికంగా మహారాష్ట్రలో 9,318 కరోనా కేసులు నమోదు కాగా, 400 మంది మృతిచెందారు. ఆ తర్వాత గుజరాత్‌లో 3,744, ఢిల్లీలో 3,314, మధ్యప్రదేశ్‌లో 2,387, రాజస్తాన్‌లో 2,364, తమిళనాడులో 2,058, ఉత్తరప్రదేశ్‌లో 2,053 కరోనా కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment