సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా భారత్‌లో కరోనా బారినపడినవారి సంఖ్య శనివారానికి 37,336కు చేరగా, ఇప్పటివరకూ 1,218 మృతి చెందారు. అలాగే 26,167 యాక్టివ్ కేసులు ఉండగా, 9,950 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 2293 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 71మంది మరణించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ఇవాళ ఉదయం ఓ ప్రకటన చేసింది. (కరోనా.. కాచుకో!)
కాగా ప్రాణాంతక కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు దాదాపు నెల రోజులకు పైగా కొనసాగుతున్న దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం మరో రెండు వారాలు పొడిగించిన విషయం తెలిసిందే. మే 4 నుంచి మరో రెండు వారాలపాటు (17 దాకా) దేశవ్యాప్తంగా అంతర్రాష్ట్ర ప్రయాణాలపై, మెట్రో, విమాన, రైల్వే సర్వీసులపై నిషేధం కొనసాగనుంది. అయితే మూడో దశ లాక్‌డౌన్ పరిమిత స్థాయిలో, పలు మినహాయింపులను కేంద్రం ప్రకటించింది. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల వారీగా కొన్ని కార్యకలాపాలకు అనుమతి ఉంటుందని వెల్లడించింది. (17 దాకా లాక్డౌన్.. సడలింపులివే..!)
Comments
Please login to add a commentAdd a comment