కరోనా : 11 వేలు దాటిన కేసులు.. 377 మంది మృతి | Coronavirus cases Cross 11000 Mark In India | Sakshi
Sakshi News home page

కరోనా : 11 వేలు దాటిన కేసులు.. 377 మంది మృతి

Apr 15 2020 10:39 AM | Updated on Apr 15 2020 11:00 AM

Coronavirus cases Cross 11000 Mark In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మానవాళికే ప్రమాదకరంగా మారిన రోనా వైరస్‌ తీవ్రత భారత్‌లో రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా కరోనా బాధితుల సంఖ్య 11 వేలు దాటింది. బుధవారం ఉదయం నాటికి కరోనా బాధితుల సంఖ్య  11,439కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించారు. దాదాపు 9,756 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా నుండి ఇప్పటి వరకు 1,306 మంది బాధితులు కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో ఈ మహమ్మారి బారిన పడి 38 మంది మృతి చెందారు. మొత్తంగా ఇప్పటి వరకు 377 మంది కరోనాతో మరణించారు.
(చదవండి : లాక్‌డౌన్‌.. కొత్త మార్గదర్శకాలు విడుదల)

మహారాష్ట్రలో అత్యధికంగా 178 మరణాలు నమోదయ్యాయి. ఢిల్లీలో 30, తమిళనాడు 12, రాజస్తాన్‌ 11, మధ్యప్రదేశ్‌ 53, గుజరాత్‌ 28, ఉత్తరప్రదేశ్‌ 8, కర్ణాటక 10, కేరళ 3, జమ్మూకశ్మీర్‌ 4, హరియాణా 3, పశ్చిమ బెంగాల్‌ 7, పంజాబ్‌ 13 మంది మృతి చెందారు.ఇక అత్యధికంగా మహరాష్ట్రలో 2,684 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా వైరస్ ప్రబలకుండా ఉండేందుకు ప్రధాన మోది అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement