న్యూఢిల్లీ: ఆయా రాష్ట్రాల్లోని శాసన మండలి ఎన్నికల్లో నల్లధనాన్ని అరికట్టేం దుకు కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటోంది. మండలి అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై పరిమితి విధించేందుకు పలు ప్రతిపాదనలను తయారు చేస్తోంది. మండలి అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై ఇప్పటి వరకు ఎలాంటి నియంత్రణ లేదు. వ్యయంపై పరిమితి విధించేందుకు అవసరమైన చట్టం చేసే ముందు ఆయా పార్టీలు, శాసనమండళ్లను కలిగి ఉన్న జమ్మూ,కశ్మీర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల అభిప్రాయా లను తెలుసుకోవాలని కేంద్ర న్యాయశాఖ సూచించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడే అభ్యర్థి చేసే వ్యయం రూ.28 లక్షలు ఉంది. దీనిలో సగం రూ.14 లక్షలను మండలి అభ్యర్థి వ్యయం చేసే వెసులుబాటు కల్పిస్తూ చట్టం చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. శాసన సభ్యులు, ఉపాధ్యా యులు, స్థానిక సంస్థలు, పట్టభద్రులు వేర్వేరుగా మండలి సభ్యులను ఎన్నుకుంటారు. కొంతమంది మండలి సభ్యులను గవర్నర్ నామినేట్ చేస్తుంటారు.
మండలి ఎన్నికల వ్యయపరిమితి 14 లక్షలు?
Published Thu, Mar 2 2017 1:11 AM | Last Updated on Tue, Aug 14 2018 4:39 PM
Advertisement
Advertisement