ఆవుల కోసం ఓ పన్ను వడ్డింపు! | Cow Cess to be Levied in Punjab Soon | Sakshi
Sakshi News home page

ఆవుల కోసం ఓ పన్ను వడ్డింపు!

Published Mon, May 16 2016 11:21 AM | Last Updated on Mon, Sep 4 2017 12:14 AM

ఆవుల కోసం ఓ పన్ను వడ్డింపు!

ఆవుల కోసం ఓ పన్ను వడ్డింపు!

ఛండీగడ్: పంజాబ్ ప్రభుత్వం ఆవుల సంరక్షణకు త్వరలోనే ఓ పన్ను (కౌ లెవీ సెస్) విధించనుంది. వాహనాల కొనుగోలు, విద్యుత్, ఇతర సేవలపై ఈ పన్ను విధించాలని నిర్ణయించినట్లు స్థానిక సంస్థల శాఖ మంత్రి అనిల్ జోషి తెలిపారు. నాలుగు చక్రాల వాహనాలపై వెయ్యి రూపాయలు, ద్విచక్ర వాహనాలపై రూ. 500 చొప్పున పన్ను విధించాలని నిర్ణయించారు. ఆయిల్ ట్యాంకర్లపై రూ.100, విద్యుత్ వినియోగదారులపై ఒక యూనిట్‌కు అదనంగా 2 పైసలు, విదేశీ మద్యంపైన రూ.10, స్థానిక మద్యంపై రూ.5 పన్నుగా విధించాలని నిర్ణయించినట్టు మంత్రి వెల్లడించారు.
 
 
ఇందుకోసం మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా తీర్మానాలు ఆమోదించారు. ఈపన్ను ఈనెల 25 నుంచి అమలులోకి రానుందని ఆయన చెప్పారు. ప్రభుత్వం కౌ లెవీ సెస్ కోసం 2014 లోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖకు ప్రతిపాదనలు పంపగా ఇప్పుడు ఆమోదం లభించింది. పంజాబ్ లోని భటిండా మున్సిపల్ కార్పొరేషన్ 2009లోనే ప్రయోగాత్మకంగా ఈ పన్నును విధించింది. స్థానిక సంస్థల నిర్ణయం వల్ల ఏడాదికి రూ.100 కోట్ల ఆదాయం సమకూరనుందని, రాష్ట్రంలో 2.69 లక్షల ఆవులు 472 షెల్టర్లలలో ఉన్నట్టు గోసేవా కమిషన్ చైర్మన్ కీమ్తి భగత్ తెలిపారు. పంజాబ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం పశుసంపదను కాపాడటం స్థానిక సంస్థల బాధ్యత.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement