మీరట్: కశ్మీర్‌లో అల్లరిమూకలను చెదరగొట్టే పెల్లెట్స్ వినియోగాన్ని తగ్గించేందుకు తక్కువ హానికరమైన ప్లాస్టిక్ బుల్లెట్లను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది. ఈ మేరకు 21 వేల రౌండ్లకు సరిపడా ఈ బుల్లెట్లను కశ్మీర్‌కు పంపించింది. ప్రస్తుతం అభివృద్ధి చేసిన బుల్లెట్లు తక్కువ హానికరమైనవని సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ఆర్‌ఆర్ భట్నాగర్ పేర్కొన్నారు.
కశ్మీర్‌లోని అన్ని యూనిట్లకు ఈ ప్లాస్టిక్ బుల్లెట్లను సరఫరా చేశామన్నారు. సీఆర్‌పీఎఫ్ దళాల వద్ద ఉండే ఏకే 47, 56 రైఫిళ్లలో ఉపయోగించేందుకు వీలుగా వీటిని తయారు చేశారని వివరించారు. భద్రతా దళాలపైకి అల్లరిమూకలు రాళ్లు విసిరినప్పుడు మాత్రమే వీటిని వాడాలని ఆదేశించామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న పెల్లెట్లపై విమర్శలు వస్తుండటంతో వీటి స్థానంలో తక్కువ హానికరమైన ప్లాస్టిక్ బుల్లెట్లను వాడాలని కేంద్రం నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment