పరిశోధనారంగాన్ని ప్రోత్సహిస్తాం: ప్రధాని | CV Raman birthday celebrations in delhi | Sakshi
Sakshi News home page

పరిశోధనారంగాన్ని ప్రోత్సహిస్తాం: ప్రధాని

Published Sun, Mar 1 2015 12:59 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

CV Raman birthday celebrations in delhi

న్యూఢిల్లీ: పరిశోధనారంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శని వారం శాస్త్రవేత్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మన శాస్త్రవేత్తల అంకితభావం, దృఢ సంకల్పం, అలుపెరుగని ప్రయత్నాన్ని గుర్తుచేసుకునే ఉత్సవంగా  నేషనల్ సైన్స్‌డేను అభివ ర్ణించారు.

విఖ్యాత శాస్త్రవేత్త సీవీ రామన్ మేథస్సుకు, సైన్స్‌కు ఆయన అందించిన సుదీర్ఘ సేవలకు మనం వందనాలర్పించాలన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలే భారత్ భవిష్యత్తును నిర్దేశిస్తాయని, ప్రస్తుతం దేశం ఈ స్థితికి చేరుకోవడంలో ఈ రంగాల పాత్ర  చాలా ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement