ఫోరెన్సిక్ నివేదికపై మండిపడ్డ అఖిలేష్
Published Wed, Jun 1 2016 5:45 PM | Last Updated on Fri, Aug 17 2018 7:32 PM
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని దాద్రి ఘటనలో మరణించిన అఖ్లాక్ ఇంట్లో దొరికింది ఆవు మాంసమేనని ఫ్లోరెన్సిక్ లెబొరేటరీ నివేదిక ఇవ్వడాన్ని ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ తప్పు పట్టారు. నివేదిక ప్రామాణికతను ఆయన ప్రశ్నించారు. శాంపిల్లను ఎవరు పంపారు? దానిని ఎవరు తీసుకున్నారు? అఖ్లాక్ ఇంట్లో అభ్యతరకరమైనదేదీ దొరకలేదని యాదవ్ పేర్కొన్నారు. ఈ విషయం తర్వాత ఏం తినాలి, ఏం మాట్లాడాలి అనే అంశంపై ప్రపంచమంతా చర్చ జరిగిందని అన్నారు. వ్యక్తిగత విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోరాదని సీఎం తెలిపారు.
దీనిపై విచారించిన ఉత్తరప్రదేశ్ వెటర్నరీ డిపార్ట్ మెంట్ అఖ్లాఖ్ ఇంట్లో ఉంది మేక మాంసమని నివేదిక ఇవ్వడంపై బీజేపీ ఎంపీ యోగి ఆదిత్య నాథ్ మండిపడ్డారు. అఖ్లాక్ కుటుంబంపై గోహత్య కింద కేసును నమోదు చేయాలని, ప్రభుత్వం అఖ్లాఖ్ కుటుంబానికి కల్పించిన సౌకర్యాలను వెనకకు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement