బలవంతపు వసూలు, దాడి ఆరోపణలపై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్, అతని అనుచరులిద్దరిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
ముంబై: బలవంతపు వసూలు, దాడి ఆరోపణలపై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్, అతని అనుచరులిద్దరిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సలీం షేక్ అనే ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆరోపణపై బైకుల్లా పోలీస్ స్టేషన్‌లో సోమవారం రాత్రి వీరిపై ఐపీసీకి చెందిన 385, 323, 34 సెక్షన్ల కింద కేసు నమోదైంది.
గత శుక్రవారం కస్కర్, అతని అనుచరులు తనపై దాడి చేసి, రూ.మూడు లక్షలు డిమాండ్ చేశారని సలీం షేక్ తన ఫిర్యాదులో ఆరోపించారు. దీంతో పోలీసులు ఇక్బాల్‌ను అరెస్టు చేశారు. ఇక్బాల్ దావూద్‌కు ఐదో సోదరుడు.