నర్సరీలో ప్రవేశాలకు నాలుగేళ్ల గరిష్ట వయోపరిమితిని నిర్ధారిస్తూ డిసెంబర్ 18న ఆప్ ప్రభుత్వం తీసుకొచ్చిన నోటిఫికేషన్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.
ఢిల్లీ సర్కారుకు హైకోర్టు ప్రశ్న
న్యూఢిల్లీ: నర్సరీలో ప్రవేశాలకు నాలుగేళ్ల గరిష్ట వయోపరిమితిని నిర్ధారిస్తూ డిసెంబర్ 18న ఆప్ ప్రభుత్వం తీసుకొచ్చిన నోటిఫికేషన్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ప్రైవేటు స్కూళ్లలో నర్సరీలో ప్రవేశానికి నాలుగేళ్ల గరిష్ట వయోపరిమితి అనే అంశం మునుపే ఉందని, అయినా ఇలాంటి నిర్ణయాలు చిన్నపిల్లల హక్కులను కాలరాయడమే అవుతుందని జస్టిస్ మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం వ్యాఖ్యానించింది. ఈ విధంగా నాలుగేళ్ల గరిష్ట వయోపరిమితిని విధించే అధికారం మీకు ఎవరిచ్చారంటూ డెరైక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను గట్టిగా నిలదీసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది.