నకిలీ ఖాతాల్లో రూ.100 కోట్లు, ఐటీ దాడి | Delhi: IT dept conduct survey at Axis Bank, Chandni Chowk branch | Sakshi
Sakshi News home page

నకిలీ ఖాతాల్లో రూ.100 కోట్లు, ఐటీ దాడి

Published Fri, Dec 9 2016 4:18 PM | Last Updated on Thu, Sep 27 2018 4:02 PM

నకిలీ ఖాతాల్లో రూ.100 కోట్లు, ఐటీ దాడి - Sakshi

నకిలీ ఖాతాల్లో రూ.100 కోట్లు, ఐటీ దాడి

న్యూఢిల్లీ: చాందిని చౌక్‌ లోని యాక్సి​స్‌ బ్యాంకులో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 44 ఖాతాల్లో రూ. 100 కోట్లుపైగా డిపాజిట్ చేయడంతో అనుమానం వచ్చిన అధికారులు శుక్రవారం సోదాలు జరిపారు. ఈ 44 ఖాతాలు నకిలీవని ఐటీ అధికారులు గుర్తించారు.

నవంబరు 8న పాత పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా చాందిని చౌక్‌ లోని యాక్సి​స్‌ బ్యాంకులోని వివిధ ఖాతాల్లో రూ. 450 కోట్లుపైగా డిపాజిటయ్యాయి. భారీ మొత్తంలో నగదు డిపాజిట్‌ కావడంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. ఈ డబ్బు ఎవరిదనే దానిపై ఆరా తీస్తున్నారు. బ్యాంకు అధికారులను ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement