
సాక్షి ప్రతినిధి, చెన్నై: చిన్నారుల అసభ్య చిత్రాలను చూసినా, డౌన్‌లోడ్ చేసినా, మొబైల్‌లో నిక్షిప్తం చేసినా అరెస్టు చేస్తామని డీజీపీ రవి మంగళవారం ప్రకటించారు. కాగా ఈ ప్రకటనపై నెటిజన్లు పలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ హెచ్చరిక కచ్చితంగా అమలు చేస్తే రాష్ట్రంలోని 50 శాతం మందిని ఖైదు చేయాల్సి వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. మహిళలు, పురుషులకు సంబంధించిన నేరాలు హెచ్చుమీరిపోతున్న పరిస్థితుల్లో సంబంధిత నిరోదక శాఖ అదనపు డీజీపీ మంగళవారం పలు ఆదేశాలు జారీ చేశారు.
చిన్నారుల అసభ్య చిత్రాలను వినియోగించేవారిలో దేశంలోనే తమిళనాడు అధికంగా ఉన్నట్లు అమెరికాకు చెందిన ఒక సంస్థ జరిపిన సర్వేలో స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సర్వే ఆధారంగా పలు చర్యలను చేపట్టబోతున్నట్టు ఆయన చెప్పారు చిన్నారుల అసభ్య చిత్రాలను చూసేవారే కాక, వాటిని డౌన్‌లోడ్ చేసే వారిపై కూడా కఠిన చర్యల కింద అరెస్టు చేస్తామని ఆయన తెలిపారు. మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ తదితరాల ద్వారా ఎంతో మంది అసభ్య చిత్రాలను చూస్తున్న ప్రస్తుతం పరిస్థితులలో డీజీపీ హెచ్చరిక హాస్యాస్పదమైన ప్రకటన అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment