మీ పిల్లలను ఇతరులతో పోల్చవద్దు: తల్లిదండ్రులకు మోదీ సలహా
న్యూఢిల్లీ: తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చి చూడవద్దని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సలహా ఇచ్చారు. అలా పోల్చడం వల్ల వారు అనవసర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. "మన్ కీ బాత్" రేడియో కార్యక్రమం తదుపరి భాగంలో ఆయన ప్రజలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పరీక్షలను ఇతరులతో పోల్చడం వల్ల వాళ్లు అనవసరంగా ఒత్తిడికి గురవుతారని అన్నారు. తమ పిల్లలు చదువులో మంచి ప్రతిభావంతులని కొంతమంది తల్లిదండ్రులు భావిస్తుంటారు. వారి అభివృద్ధిని తమ స్నేహితులతో, తోటివారితో, సహోద్యోగులతో చెప్పుకొని గర్వపడతారు.
పిల్లలపై అనవసరంగా ఒత్తిడి పెంచకుండా వారిపై నమ్మకముంచండి. అప్పుడే మంచి ఫలితాలొస్తా''యని మోడీ తెలిపారు. జాతీయ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు(సీబీఎస్ఈ) నిర్వహించే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి నెలలో జరగనున్నాయి. పరీక్షల సందర్భంగా మోడీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ''మన్ కీ బాత్'' కార్యక్రమానికి ఆహ్వానించారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రధానిని కలిసి గతంలో పరీక్షల సందర్భాల్లో తమ అనుభవాలను మోదీతో పంచుకున్నారు.