అన్ని పార్టీల్లో వారసత్వ రాజకీయాలున్నాయి: దిగ్విజయ్ | Dynastic politics are every where: Digvijay Singh | Sakshi
Sakshi News home page

అన్ని పార్టీల్లో వారసత్వ రాజకీయాలున్నాయి: దిగ్విజయ్

Published Mon, Oct 28 2013 1:15 PM | Last Updated on Tue, Aug 14 2018 3:55 PM

అన్ని పార్టీల్లో వారసత్వ రాజకీయాలున్నాయి: దిగ్విజయ్ - Sakshi

అన్ని పార్టీల్లో వారసత్వ రాజకీయాలున్నాయి: దిగ్విజయ్

దేశంలో వారసత్వ రాజకీయాలు సాధారణమేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సమర్థించారు. అన్ని పార్టీలలోనూ వారసత్వ రాజకీయాలు ఉన్నాయని పేర్కొన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ వారసత్వ రాజకీయాల్ని బద్దలు కొడదామంటూ చేసిన వ్యాఖ్యలకు దిగ్విజయ్ పైవిధంగా స్పందించారు.

రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి దిగ్విజయ్ ఆచితూచి మాట్లాడారు. రాష్ట్ర విభజన అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రధాని మన్మోహన్ సింగ్కు రాసిన లేఖను చూడలేదని చెప్పారు. విభజన ప్రక్రియకు సంబంధించి రాజ్యాంగ నియమావళి ప్రకారం నడుచుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్లకు కిరణ్ లేఖలు రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement