పశ్చిమ బెంగాల్, బీహార్లలో మళ్లీ భూకంపం
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో మరోసారి భూకంపం వచ్చింది. సోమవారం సాయంత్రం భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.6గా నమోదైంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది. ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం లేదు.
గత రెండు రోజులు భూప్రకంపనలు వస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలను భూకంపం వణికించింది. ఎక్కువగా బీహార్లో ప్రాణనష్టం జరిగింది. శనివారం సంభవించిన భూకంపం ధాటికి దేశంలో దాదాపు 70 మంది మరణించారు. వీరిలో బీహార్కు చెందినవారే 50 మంది ఉన్నారు.