నరేంద్రమోడీని ఈసీ నిషేధించాలి: బేణి
లక్నో: ప్రత్యర్థి రాజకీయ నేతలపై ఎడాపెడా విమర్శలు చేసే కేంద్ర మంత్రి బేణి ప్రసాద్ వర్మ తాజాగా నరేంద్రమోడీ, అమిత్ షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు మతం రంగు అద్దుతున్న నరేంద్రమోడీ, అమిత్ షాలను ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించాలని బేణి డిమాండ్ చేశారు.
మతాన్ని రాజకీయాలకు ఉపయోగించుకుంటున్న బీజేపీ, సమాజ్ వాదీ పార్టీలను నిషేధించాలని ఎన్నికల సంఘానికి ఆయన విజ్క్షప్తి చేశారు.
అనేక అరోపణలు ఎదుర్కొంటున్న అమితా షాపై అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయని.. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న విషయాన్ని బేణి మీడియా దృష్టికి తీసుకువచ్చారు.